Home

»

Tv News

Karthika Deepam2 : పోలీసుల ఎంట్రీతో షాక్ లో మాలిని, సూరజ్.. జ్యోత్స్న ఏం చెప్పనుంది!

Oct 24, 2026 10:29AM

స్టార్‌ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీకదీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-812లో.. జ్యోత్స్న ప్లాన్ చేసిన షెడ్యూల్ చూసి సూరజ్ కోపంగా పేపర్లు ముఖం మీద విసిరేసి.. రికమండేషన్ తో వచ్చిన వాళ్లకు పని చేతకాదు, అందుకే నిన్ను రిజెక్ట్ చేశానని అరుస్తాడు. దీంతో జ్యోత్స్న కోపంగా కుర్చీని తన్ని సూరజ్ ని లాగిపెట్టి కొట్టి కాలర్ పట్టుకుని.. నన్ను రిజెక్ట్ చేస్తావా, నేను ఒకప్పుడు ఈ కంపెనీకే CEO ని, నువ్వు షార్ట్ కట్ లో ఛైర్మన్ అయ్యావ్.. నేను యాటిట్యూడ్ కి అంబాసిడర్ ని అని రివర్స్ అవుతుంది. కానీ ఇదంతా జ్యోత్స్న కలగా తేలుతుంది. నిజంలో మాత్రం జ్యోత్స్న సారీ సర్ అని పేపర్లు ఏరి మళ్లీ చేసి తెస్తానని వెళ్లిపోతుంది. అంత ఈజీగా ఎలా పోతావే అని మాలిని మనసులో నవ్వుతుంది.

 

తర్వాత కార్తీక్, దీప వచ్చి జ్యోత్స్నను ఓదారుస్తారు. నేను లూజర్ ని, గొప్పింటి బిడ్డగా రావడం గెలుపు అనుకున్నా, కానీ ఓడిపోయాను, అమ్మాన్నల కోసం ఏం చేయలేకపోయానని జ్యోత్స్న బాధపడితే నువ్వు ఓడిపోలేదు, నేర్చుకుంటున్నావ్, ఒక్క మెట్టు ఎక్కావ్, నిన్ను నువ్వు కంట్రోల్ లోకి తెచ్చుకుంటున్నావని కార్తీక్ ధైర్యం చెప్తాడు. సూరజ్ నిన్ను పంపించడానికి 100 ప్రయత్నాలు చేస్తాడు. మాలిని లైట్ లేని చీకటి గదిలో పాములాంటిది జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్.

 

సూరజ్ కి జ్యోత్స్న షెడ్యూల్ ఇస్తుండగా.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి జ్యోత్స్న కిడ్నాప్ కేసు గురించి ఎంక్వైరీకి వచ్చామని అంటారు. మిమ్మల్ని ఎవరైనా బంధించారా అని ఎస్సై అడిగితే జ్యోత్స్న.. అవును ఎత్తుకెళ్లారు, బ్లాక్ మెయిల్ చేసి కళ్లకు గంతలు కట్టి బంధించారని చెప్తుంది. ఎవరో తెలియదని చెప్పి ఊపిరి పీల్చుకుంటున్న మాలిని, విజయ్ ల మధ్యలోనే.. నాకు అనుమానం ఉన్న మనిషి ఇక్కడే ఉన్నారని వేలితో చూపించడంతో మాలిని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

SEO Keywords:

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com