Home

»

Tv News

Karthika Deepam2 :జ్యోత్స్న ప్రేమని సూరజ్ అర్థం చేసుకుంటాడా..‌కార్తీక్ ఏం చేయనున్నాడు!

Sep 5, 2026 9:41AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  కార్తీక దీపం2 karthika Deepam2. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 770 లో....సూరజ్‌ని కలిసి తన బాధ చెప్పుకుంటే మారతాడని వెతుక్కుంటూ వెళ్తుంది జ్యోత్స్న. కానీ సూరజ్ కనికరించలేదు. మీ అమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్లినందుకు మా కుటుంబం పడిన బాధ ఇప్పుడు మీ కుటుంబం కూడా పడాలంటూ పగ సాధిస్తాడు. నువ్వు పగ కోసమే నన్ను ప్రేమించావా.. ఐ లవ్యూలన్నీ అబద్దాలేనా అని జ్యోత్స్న నిలదీస్తే అవును నేనేం చేసినా నా తల్లి కోసమే చేశానని తెగేసి చెప్తాడు. మనసు తప్ప అన్నీ తిరిగి ఇచ్చేశావ్ కానీ మనసు నీతోనే ఉండిపోయింది..‌దాన్ని తిరిగి ఇవ్వలేవంటూ జ్యోత్స్న కన్నీరు పెడుతుంది. మర్చిపో అన్నీ మర్చిపో అని చెప్పేసి సూరజ్ వెళ్ళిపోతాడు.

 

మరోవైపు మాలిని ఇంటికి దీప, కార్తీక్ వస్తారు. తాత దక్షిణామూర్తిని కలిసి సుమిత్ర.. నీ సొంత కూతురేనా అని, కన్నకూతురైతే ఇంత పగ ఎందుకని కార్తీక్ ప్రశ్నిస్తాడు. కూతురు పెళ్లి ఆగిపోయి బ్రెయిన్ డెడ్ అయ్యే పరిస్థితి వచ్చిందని, హత్య అంటే మనిషిని చంపడం ఒక్కటే కాదు మనసుని చంపడం కూడా హత్యేనని.. జ్యోత్స్న నీ మనవరాలే గతాన్ని గతంలోనే వదిలేయ్ అని చేతులు పట్టుకుని బ్రతిమాలతాడు. దీంతో దక్షిణామూర్తి చలించిపోతే.. వాడు మాటలతోనే మాయ చేస్తున్నాడు.. మా మామయ్య ఏదీ మర్చిపోలేదంటూ మాలిని అడ్డుపడి ఇది ఆరంభం మాత్రమే అంటుంది.

 

ఇటు జ్యోత్స్నను కలిసిన దాసు, నువ్వు నా కూతురివి అని చెప్పేస్తే సూరజ్ పెళ్లి చేసుకుంటాడని అంటాడు. అయితే అదే నిజం పెళ్లి మండపంలో ఎందుకు చెప్పలేదని సూరజ్ వెతుక్కుంటూ వచ్చింది నన్ను కాదు సుమిత్ర కూతుర్ని.. ఆ స్థానంలో ఎవరున్నా ప్రేమించేవాడు.. నేను దాసు కూతుర్ని అని తెలిస్తే మొహం కూడా చూసేవాడు కాదని జ్యోత్స్న చెప్తుంది. సూరజ్ మోసం మాత్రమే చేశాడు.. అన్యాయం చేయలేదు.. మనసుతో ఆడుకున్నాడు కానీ ప్రేమ పేరుతో హద్దులు దాటలేదు. ఒంటిపై చేయి కూడా వేయలేదు వాడు గొప్పోడు నాన్న అంటూ జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com