Home

»

Tv News

Karthika Deepam2: జ్యోత్స్న జీవితం నాశనం, సూరజ్ మోసం బట్టబయలు!

Sep 1, 2026 10:18AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2 Karthika Deepam2. ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ 765లో.. మాలిని ఆవేశంగా ముందుకు వస్తుంది. ఏమే జ్యోత్స్న.. అక్కడే కూర్చుండిపోయావేం లేవలేకపోతున్నావా..మీ అమ్మ చేసిన తప్పుకు నీకు ఈ శిక్ష పడింది. మీ అమ్మ పెళ్లి సమయంలో మా కుటుంబం అనుభవించిన నరకానికి ఇప్పుడు మీరే నష్టపోవాలంటూ అందరి ముందు అసలు నిజం బయటపెడుతుంది. ఆ మాటలకు జ్యోత్స్న భాదపడుతూ.. నా అమ్మ శత్రువులు ఎవరైనా సరే.. నాకు కూడా శత్రువులే అంటూ కన్నీళ్లతో కుప్పకూలిపోతుంది. ఆ పరిస్థితిని చూసి తట్టుకోలేక సుమిత్ర షాక్‌తో మాట్లాడలేని స్థితికి చేరుకుంటుంది.

 

పరిస్థితి చేయి దాటడం చూసిన కోపంతో కార్తీక్.. నేరుగా సూరజ్ దగ్గరకు వెళ్లి కాలర్ పట్టుకుని.. ఏంట్రా ఇదంతా? ఒక ఆడపిల్ల ఆశలతో ఆడుకునే హక్కు నీకు ఎవరిచ్చారు? నిన్ను నమ్మి ఇంటికి తెస్తే ఇంత మోసం చేస్తావా అంటూ నిలదీస్తాడు.కార్తీక్ మాటలకు ఏమాత్రం బెదరని సూరజ్ వెక్కిరిస్తూ.. థాంక్స్ బ్రదర్.. నా తల్లి చెప్పిన పగ తీర్చుకోవడానికి నేను ఈ ఇంటికి రాగలిగానంటే దానికి ప్రధాన కారణం మీరే.. మీరే కదా నన్ను ఆ రోజు ఆపదలో ఉంటే కాపాడుకుని ఈ పెళ్లి పీటల దాకా తెచ్చిందని అంటాడు.

 

అది విన్న దీప మధ్యలో కలుగజేసుకుంటూ..‌మేం నిన్ను మంచివాడని నమ్మి ఆనాడు సహాయం చేశాం కానీ, ఇలా మా నమ్మకాన్ని వమ్ము చేసి వెన్నుపోటు పొడుస్తావని కలలో కూడా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది.దానికి సూరజ్ మరింత స్పష్టంగా..‌అదే కదా నేను చెప్పేది! మీరే అనవసరంగా వేలు పెట్టి నన్ను జ్యోత్స్న జీవితంలోకి తెచ్చారు కాబట్టి ఇప్పుడు ఆమె జీవితం సర్వనాశనం కావడానికి పూర్తిగా మీరే కారణం అవుతారని చెప్తాడు. కార్తీక్, దీప ఏం చేయలేకపోతారు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com