Home

»

Tv News

Karthika Deepam 2: పీఏగా జ్యోత్స్నకు సూరజ్ షాక్.. పట్టువదలని విక్రమార్కురాలిగా ఎంట్రీ!

Oct 4, 2026 12:33PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -795 లో.....  మొదలుపెట్టిన రోజే వ్యాపారం జరగాలంటే జరగదని  దీప చెప్తుంటే.. టిఫిన్ బండి పెట్టడంలో మాకు నీ అంత అనుభవం లేదు కదమ్మా అని  పారిజాతం అంటుంది. దీప అన్నదాంట్లో తప్పేం ఉంది, మేమూ ఇలాంటి బాధలు పడ్డాం, పుంజుకోవడానికి టైమ్ పడుతుందని కార్తీక్ సపోర్ట్ చేస్తాడు. క్యాన్ లో ఇడ్లీలు ఉండటంతో .. దీపా నీ స్టైల్ లో ఉప్మా చేసేయ్.. టిఫిన్ చేద్దాం, తాతకు ఫుడ్ వేస్ట్ ఇష్టం ఉండదని  అంటాడు. దానికి శివన్నారాయణ.. నువ్వు ఫుడ్ వేస్ట్ అంటుంటే నన్ను వేస్ట్ అన్నట్టు ఉంది.. నేను బండి తీసుకోవడానికి కారణం కార్తీకే అని బాధపడతాడు.

ఇక ఇంటర్వ్యూకి వచ్చిన జ్యోత్స్నను పీఏ గా ఉండే అర్హత లేదంటూ సూరజ్ రిజెక్ట్ చేసి పంపిస్తాడు. ఆల్రెడీ రిజెక్ట్ చేశా కదా మళ్లీ ఎందుకు వచ్చావని  సూరజ్ అంటే ఈ ఆఫీస్ నాది అని చెప్పుకునే హక్కు మా తాతకు మాత్రమే ఉంది.. నీకో మీ అమ్మకో లేదని జ్యోత్స్న కౌంటర్ ఇస్తుంది. మా అమ్మ మీ ఆస్తుల్నే లాక్కుంది. కానీ మీ అమ్మ మా అమ్మ ఐదోతనాన్ని లాక్కుందంటూ  ఇద్దరూ పాత గొడవను తవ్వుకుంటారు.

ఆ తర్వాత మాలిని వచ్చి దీప, కార్తీక్ లను.. సూరజ్ ని జ్యోత్స్నకు దగ్గర చేసే ప్రయత్నాలు బాగానే చేస్తున్నారు కదా, పీఏ పోస్ట్ కు జ్యోత్స్నను బాగానే పంపించారని వెటకారంగా అంటుంది. మాకు ఈ విషయం తెలియదని దీప, కార్తీక్ అంటే.. భలే యాక్ట్ చేస్తున్నారు, సహజ నటులు కదా అని మాలిని తిడుతుంది. మేం మనుషులంతా కలిసి ఉండాలనే అనుకుంటాం.. అందుకే సూరజ్, జ్యోత్స్న కలిసి ఉండాలని కోరుకుంటున్నామని దీప అంటుంది. వాడి జీవితంలోకే కాదు, ఆఫీస్ లోకి కూడా రానివ్వడు, ఆల్రెడీ రిజెక్ట్ చేశాడని మాలిని అనగా జ్యోత్స్న మనసు పెట్టి చేయాలనుకుంటే ఎంత దూరమైనా వెళ్తుంది. దాన్ని ఆపడం నీ వల్ల కాదు పిన్నీ అని కార్తీక్ అంటాడు.

మరోవైపు ఉదయాన్నే శివన్నారాయణ పట్టు వదలకుండా మళ్లీ టిఫిన్ బండి స్టార్ట్ చేసి.. ఇడ్లీ ఫ్రీ అని బోర్డు పెడతాడు. సత్తిబాబు హేళన చేస్తుండగా ఒక పెద్దాయన వచ్చి ఇడ్లీ తిని.. టిఫిన్ అదిరిపోయింది, ఫ్రీగా పెట్టాల్సిన అవసరం లేదు, పెద్ద హోటల్లో తిన్నట్టు ఉందని డబ్బులు ఇచ్చి వెళ్లి నలుగురికి చెప్తాడు. దీంతో బండి దగ్గర క్యూ కడతారు, శివన్నారాయణ బండి సక్సెస్ అవుతుంది. 

చివర్లో మాలిని.. కొత్త పీఏని పిలువమని అనగానే అటెండర్ పిలవగా జ్యోత్స్న మాస్ ఎంట్రీ ఇస్తుంది. ఇది పీఏ ఏంటి, నా కాళ్ల మీద పడి బతిమిలాడినా ఉండనీయనని మాలిని అంటే నేను కాళ్లు పట్టుకునే టైప్ కాదు.. అపాయింట్ మెంట్ లెటర్ తోనే వచ్చానని జ్యోత్స్న అంటుంది. మాలిని లెటర్ చింపబోతుండగా దక్షిణామూర్తి ఎంట్రీ ఇచ్చి.. ఆగు మాలినీ, అది ఇచ్చింది నేనే, ఈరోజు నుంచి నా మనవరాలు జ్యోత్స్న సూరజ్ కి పీఏగా ఉంటుందని చెప్పడంతో మాలినికి మైండ్ బ్లాంక్ అవుతుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com