Home

»

Tv News

Karthika Deepam2: కూతురు అంటూ నోరు జారిన దశరథ్.. 

May 26, 2026 10:23AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -679 లో......సుమిత్ర ఒళ్ళో తల వాల్చి దీప పడుకుంటుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి సుమిత్ర, దీపలని అలా చూసి షాక్ అవుతుంది. ఈ దీప అనుకున్నది చేసిందని కోప్పడుతుంది. దగ్గరికి వెళ్లి మమ్మీ ట్యాబ్లెట్ వేసుకున్నావా అని అడుగుతుంది. వేసుకున్నానని సుమిత్ర చెప్తుంది. జ్యో మా అమ్మమ్మ ఒళ్ళో అమ్మ పడుకుంది.. అమ్మ ఒళ్ళో నేను పడుకుంటానని శౌర్య అంటుంది. తర్వాత దీప ఒళ్ళో శౌర్య పడుకుంటుంది. అది చూసి జ్యోత్స్న కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడే కార్తీక్ వచ్చి తల్లి కూతుళ్లు అలా ఉండడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే దశరథ్ వచ్చి వాళ్ళు అలా ఉండడం చూసి ఒక ఫోటో తీసి మురిసిపోతాడు.

ఆ తర్వాత జ్యోత్స్న నిద్రపోకుండా ఆలోచిస్తుంటే ఏంటే ఇంకా నిద్ర పోవడం లేదని కాంచన అడుగుతుంది. నువ్వు పడుకో అత్త నా గురించి నీకెందుకని అంటుంది. ఉండు మా నాన్నకి అన్నయ్యకి ఫోన్ చేస్తానని కాంచన అనగానే వద్దు పడుకుంటున్నానని జ్యోత్స్న పడుకుంటుంది. మరుసటి రోజు జ్యోత్స్న నిద్ర లేచేసరికి పూజ చేసి గంట సౌండ్ వినిపిస్తుంది. అది విని జ్యోత్స్న కోపంగా కిందకి వస్తుంది. పారిజాతం ఎదురుపడుతుంది. నువ్వు ఇక్కడే ఉన్నవా అయితే ఎవరు పూజ చేసిందని జ్యోత్స్న అంటుంది. గంట కొడుతూ శౌర్యా వస్తుంది. వెనకాల దీప వస్తుంది. ఇంట్లో అందరు హాల్లోకీ వస్తారు. నా కూతురు మొదటి రోజు ఇంట్లో అడుగుపెట్టి పూజ చేసింది.. తన కాళ్ళ పట్టీల సౌండ్ ఇల్లంతా సందడిగా మారిందని దశరథ్ అనగానే అందరు షాక్ అవుతారు.

ఏంటి అన్నయ్య జ్యోత్స్నని అనాల్సిన మాటలు దీపని అంటున్నావని కాంచన అనగానే ఇలా అన్నాను ఏంటని దశరథ్ అనుకుంటాడు. దాంతో దశరత్, కార్తీక్ కలిసి కవర్ చేస్తారు. ఆ తర్వాత దీప గుడికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. కార్తీక్ ని కూడా తీసుకొని వెళ్ళమని కాంచన అంటుంది. ఇప్పుడు గానీ మేం ఇద్దరం వెళ్తే ఇంకా ఏమైనా ఉందా కాంపిటేషన్ మీరు కలిసి ఉండొద్దని చర్చ పెడుతుంది జ్యోత్స్న అని కార్తీక్ అంటాడు. అలా ఏం లేదు మీరు ఇద్దరు గుడికి వెళ్లి రండీ కానీ గంటలో రావాలని జ్యోత్స్న చెప్పగానే  కార్తీక్, దీప బయల్దేర్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com