Home

»

Tv News

Jayam : ప్రాణాపాయ స్థితిలో గంగ.. నిజం తెలుసుకున్న సుధా! 

Oct 17, 2026 8:43AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -401 లో..... లోపల పాయసం లో జయ విషం కలుపుతుంది. ఆ పాయసం గంగ తీసుకొని వెళ్లడం అందులో ఏదో కలిపిందని గంగ పై నింద వేస్తుంది. నేను అందులో ఏం కలపలేదని నిరూపించుకోవడం కోసం గంగ ఆ పాయసం తాగుతుంది. అప్పుడు బానే ఉంటుంది బయటకు వచ్చాక కళ్ళు తిరుగుతున్నాయని అంటుంది. దాంతో రుద్ర వెంటనే హాస్పిటల్ కీ తీసుకొని వెళ్తాడు. ఆమె తిన్న దాంట్లో ఎవరో పాయిజన్ కలిపారు.. అది చాలా డేంజర్, ఆమె ప్రాణానికి ప్రమాదమని డాక్టర్ చెప్తారు.

మరొకవైపు బాబు ఏడుస్తుంటే ప్రీతీ ఊరుకోబెడుతుంది‌. అప్పుడే వీరు వచ్చి నువ్వు వెళ్లు నేను చూసుకుంటానని అంటాడు. బాబు నవ్వుతుంటే నీకు కూడా నన్ను చూస్తూ నవ్వొస్తుందా అని కోపంగా బాబుని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తాడు కానీ రివర్స్ గా తనకే దెబ్బ తగులుతుంది. అప్పుడే ప్రీతీ వచ్చి ఏమైందని అడగ్గా బాబుని ఆడిస్తుంటే పడిపోయానని వీరు కవర్ చెప్తాడు. మరొక వైపు విషం బాటిల్ ని జయ చూస్తూ.. పాపం ఇప్పుడు ఆ గంగ ఎలా ఉందో ఒకవేళ తనకి ఏమన్నా అయితే నాపై డౌట్ వస్తుందా అని అనుకుంటుంది. అప్పుడే సుధా వస్తుంది. సుధా వస్తుందన్న కంగారులో ఆ బాటిల్ కింద పడేస్తుంది జయ.

అది చూసి ఏంటి ఈ బాటిల్ .. నీ దగ్గర ఉందని సుధా అడగ్గా జయ కంగారుపడుతుంది, ఏంటి ఏదో తప్పు చేసావ్ విషం కలిపింది నువ్వేనా.. అప్పుడు అంత  గొడవ చేసావ్ నువ్వే కలిపావా అని సుధా అడగడం తో జయ భయపడి నిజం చెప్తుంది. దాంతో జయ చెంపచెల్లుమనిపిస్తుంది సుధా. వెంటనే రుద్రకి సుధా ఫోన్ చేసి గంగ గురించి అడగుతుంది. సీరియస్ గా ఉందని రుద్ర అనడంతో వెంటనే జయని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తుంది సుధా. రుద్రకి భయపడి జయ లోపలకీ వెళ్లదు. గంగ ఆ పరిస్థితికి కారణం జయ అని చెప్పాలని అనుకుంటుంది సుధా కానీ రుద్ర ముందే చెప్తాడు. అత్తయ్య గంగకి ఏమైనా అయితే అప్పుడు జయ సంగతి చెప్తానని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com