(2).webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం Jayam. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 359 లో ..గంగకి రుద్ర ఫోన్ చేస్తుంటే గంగ లిఫ్ట్ చేయదు. అప్పుడే అక్కడికి శకుంతల వస్తుంది. రుద్రతో మాట్లాడుతుంది. గంగ నిద్రపోతుంది. ఎంత పిలిచినా లేవడం లేదని శకుంతల అబద్ధం చెప్తుంది. మరోవైపు స్పాన్సర్లు కోపంగా.. ఇలాంటి డిసిప్లిన్ లేని వాళ్లతో ఎలా అగ్రిమెంట్ కుదుర్చుకుంటామని అక్కడి నుంచి వెళ్లిపోతారు.
నేను ముందు నుంచే చెప్తున్నా, ఎంత టాలెంట్ ఉన్నా కూడా డిసిప్లిన్ ఉండాలి అని. కానీ నా మాట ఎప్పుడూ వినలేదు. ఇప్పుడు తన వల్ల నా పరువు పోయిందని విశ్వ కోప్పడతాడు. దీంతో రుద్ర కోపంగా ఇంటికి వెళ్లి గంగపై వాటర్ చల్లి నిద్ర లేపుతాడు. ఎందుకు ఇలా చేశావ్.. అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిందని తన చెంపచెల్లుమనిపిస్తాడు. నీ వల్ల మావయ్య పరువుపోయింది. రేపటి నుంచి నీకు ట్రైనింగ్ ఇస్తాడో ఇవ్వడో. ఒక తప్పు వల్ల ఇన్ని రోజులు చేసింది మొత్తం పోయిందని గంగపై రుద్ర సీరియస్ అవుతాడు.మరోవైపు విశ్వ ఇంటికి వెళ్తాడు. గంగ స్పాన్సర్ అగ్రిమెంట్ అయిందా అని సుధా అడుగుతుంది.నేను ఢిల్లీ వెళ్లాలి అర్జెంట్ గా, బట్టలు సర్దమని విశ్వ అంటాడు. అదేంటి, నేను అగ్రిమెంట్ గురించి అడుగుతున్నానని సుధా అంటుంది. అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిందని జరిగింది చెప్తాడు. దొరికింది ఛాన్స్, ఆ గంగకి చాలా పొగరు అని సుధా అంటుంది.నేను బాక్సింగ్ నేర్చుకుని మీ పరువు నిలబెడతానని జయ అనగానే దట్స్ మై డాటర్ అని విశ్వ అంటాడు.
ఆ తర్వాత రుద్ర కోపంగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. తన దగ్గరికి వెళ్లి గంగ మాట్లాడుతుంటే రుద్ర కోప్పడతాడు. తరువాయి భాగంలో గంగ బాక్సింగ్ గ్లోవ్స్ ని ఇషిక తీసుకొని వెళ్లి డస్ట్ బిన్ లో పారేయాలని అనుకుంటుంది. అప్పుడే గంగ వచ్చి తనని కొట్టబోతుంటే శకుంతల వచ్చి ఆపుతుంది. ఇషిక చేస్తుంది తప్పు ఎలా అవుతుందని గంగపైనే సీరియస్ అవుతుంది శకుంతల. ఆ తర్వాత రుద్ర దగ్గరికి వెళ్లి.. మీరు ఎందుకు మాట్లాడడం లేదని గంగ అడుగుతుంది. తప్పు నీ వైపు ఉంది కాబట్టి అని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





(1).webp)
