Home

»

Tv News

Jayam serial : జయ అసలు నిజం బయటపెట్టేసిన హాస్టల్ వార్డెన్.. షాక్ లో ఫ్యామిలీ!

Sep 5, 2026 10:11AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ జయం Jayam. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 365 లో.. వరలక్ష్మి వ్రతం సందర్భంగా జయ వాళ్ళ ఇంట్లో అందరు పూజలో ఉండగా జయ హాస్టల్ వార్డెన్ అక్కడికి వస్తుంది. తనను చూసి జయ ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది. నువ్వు ఏంటి ఇక్కడ అని జయ అడుగుతుంది. మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను..‌ తను ఇంట్లో లేదు అందుకే నేను వ్రతానికి వచ్చానని వార్డెన్ సమాధానమిస్తుంది. అయితే ఆమె రాక వెనుక పెద్ద ప్లాన్ ఉందని జయకు అర్థం కాదు.

 

మరోవైపు సుధా దగ్గరికి పెద్దసారు వచ్చి విశ్వను ఢిల్లీ నుంచి వచ్చాక గంగకు ట్రైనింగ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయమని చెప్తాడు. జయకు ట్రైనింగ్ ఇస్తాడు అన్నయ్య అని సుధా చెప్పగా.. గంగ గెలవాలి అమ్మ అని పెద్దసారు అంటాడు. అదేంటి అన్నయ్య నీ మేనకోడలు గెలవకూడదా అని సుధ అడగగా అదేం కాదమ్మా గంగ గెలుపుకు దగ్గరగా ఉందని అంటాడు. ఆ తర్వాత శకుంతల వచ్చి అసలు గంగకు ఇంట్రెస్ట్ లేదు.. ఉంటే అలా ఉంటుందా.. జయ ఛాంపియన్ అయితే నీకు మాకు గౌరవంగా ఉంటుంది.. మీ అన్నయ్య మాటలు ఏం పట్టించుకోకని సుధాకు అపర్ణ చెప్తుంది.

 

ఇక వరలక్ష్మి వ్రతం మొదలైంది. హాస్టల్ వార్డెన్ జయ దగ్గరికి వచ్చి నువ్వు వీళ్ళ కూతురు అంటున్నారేంటి.. మీ అమ్మనాన్న చనిపోతే నేనే కదా హాస్టల్ లో జాయిన్ చేశాను. ఇక్కడ ఆస్తులు చూసి ఇలా ప్లాన్ చేశావా.. వాళ్ళ ఎమోషనల్ తో ఆడుకుంటున్నావా.. ఈ విషయం వాళ్ళతో చెప్తానని బెదిరిస్తుంది. దీంతో జయ భయపడి వెంటనే వీరు వాళ్ళకి వార్డెన్ గురించి చెప్తుంది. ఇప్పుడు నాకు భయంగా ఉంది.. ఎక్కడ నిజం బయటపడుతుందోనని వీరు వాళ్ళతో జయ చెప్తుంది. అసలు ఆ వార్డెన్ అక్కడికి రావడానికి కారణం రంగానే, జయ గురించి నిజం బయటపెట్టడానికి రంగానే ఆమెను రప్పిస్తాడు.

 

ఇక రుద్రకు ఏదో గుర్తుకు వచ్చి బయటకు వెళ్తాడు. మరోవైపు జయ నాకు తెలుసని వార్డెన్ అందరితో అంటుంది. ఏం అంటావ్ నిషా అని జయతో వార్డెన్ అనగానే అందరు షాక్ అవుతారు. తరువాయి భాగం ప్రోమోలో గంగ తాగిన పాలలో స్లీపింగ్ టాబ్లెట్ కలిపారని రుద్ర ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com