
సోషల్ మీడియాలో ఇంద్రజ ఫేస్ బుక్ వివాదం ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఒక వీడియోని ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఆల్రెడీ ఈ ఫేస్ బుక్ పేజీ మీద సైబర్ క్రైమ్ సెల్ లో కంప్లైంట్ ఇచ్చినట్టు ఆవిడ చెప్పారు. ఐతే ఇప్పుడు ఆ పేజీ నడిపే వ్యక్తి రిప్లై ఇచ్చారంటూ ఒక వీడియో చేశారు. మొదట్లోనే ఆమె ఈ ఫేస్ బుక్ పేజీ నడిపేవాళ్లకు మెసేజ్ ఇచ్చినా స్పందించకపోవడంతోనే విషయాన్నీ బయటపెట్టాల్సి వచ్చిందంటూ ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఆ ఫేస్ బుక్ నడిపే వ్యక్తి ఇచ్చిన రిప్లై ఏంటో ఆమె చెప్పారు. " మేడం నేను మీ అభిమానిని. ఆ అభిమానంతో ఈ పేజీ ని నడుపుతున్నాను ఎలాంటి మోనిటజషన్ నేను చేసుకోలేదు. మీరు అడిగి ఉంటె ఇన్నేళ్ల శ్రమను మీ చేతుల్లో పెట్టేవాడిని " అని చెప్పాడు. ఈ మాటల మీద ఇంద్రజ మండిపడ్డారు. "అసలు ఎవరిని అడిగి ఈ పేజీ క్రియేట్ చేశారు. పర్మిషన్ తీసుకున్నారా.. మోనిటజషన్ చేసుకోలేదా.ఫేస్ బుక్ పేజెస్ నడిపేవాళ్లకు ఆ మోనిటైజెషన్ వ్యవహారాలూ తెలీవనుకుంటున్నారు.
అచ్చంగా ఒక ఆర్టిస్ట్ నడిపితే ఎలా ఉంటుందో అలాగే నడుపుతున్నారు. ఫ్యాన్ పేజీ అని ఫాలోవర్ పేజీ అని పెట్టి నడపాలి అదే రూల్ కదా. అలా చేయకుండా బ్లూ టిక్ కూడా మెటా నుంచి తీసుకున్నారు. ఎవరిని అడిగి ఇదంతా చేశారు. మోనిటజషన్ తీసుకోకపోతే మంచిదే ఐనా నా పర్మిషన్ లేకుండా ఎలా నడుపుతారు అంటూ ప్రశ్నించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేసాను. అరెస్ట్ చేయడం ఒక్కటే పెండింగ్ ఉంది. ఐనా నాకు ఎవరి కష్టం అక్కరలేదు నా కష్టం మీదే నేను బతుకుతాను . అభిమానం ఉంటే పేజీ నడిపేటప్పుడు ఫ్యాన్ పేజీ అని స్పష్టంగా చెప్పాలి. " అన్నారు ఇంద్రజ.






