స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-584లో.. ధీరజ్, ప్రేమల వ్యవహారం పోలీస్ స్టేషన్‌కి చేరడంతో రెండు కుటుంబాలు అక్కడికి వస్తాయి. కేసులు వెనక్కి తీసుకుని రాజీ పడదామని రామరాజు చెప్పగా భద్రావతి మాత్రం ప్రేమ గతంలో ఇచ్చిన మాటను గుర్తు చేస్తుంది. ధీరజ్ మళ్లీ నీ పరువు తీస్తే అతని జీవితంలోకి వెళ్లనని చెప్పావు కదా.. ఆ మాట మీద నిలబడాలని అంటుంది. మరోవైపు రామరాజు మాత్రం ఎలాగైనా ప్రేమను తమ ఇంటి కోడలిగా తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. పోలీస్ స్టేషన్‌లో భద్రావతి కొన్ని షరతులు పెట్టగా, ధీరజ్ వాటిని అంగీకరించడు. ప్రేమ కూడా.. ధీరజ్ నన్ను బాధపెట్టడం కొత్త కాదు.. నాకూ ఆత్మాభిమానం ఉందంటూ అతనితో వెళ్లడానికి నిరాకరిస్తుంది.
వీళ్ల పెళ్లి జరిగినట్టు ఒక్క సాక్ష్యం కూడా లేదు. ధీరజ్ ప్రేమ మెడలో కట్టింది పసుపుతాడు మాత్రమే.. చట్టబద్ధంగా పెళ్లి జరగలేదంటూ రామరాజుకు భద్రావతి సవాల్ చేస్తుంది. దాంతో రామరాజు వెనక్కి తగ్గకుండా.. రెండు రోజుల్లో నా కొడుకు ధీరజ్‌కి, ప్రేమకి అగ్నిసాక్షిగా, వేదమంత్రాల సాక్షిగా, అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను. ఆ పెళ్లికి నువ్వే సాక్షిగా నిలబడేలా చేస్తానని శపథం చేస్తాడు. భద్రావతి కూడా.. రెండు రోజుల్లో పెళ్లి చేయలేకపోతే ప్రేమ శాశ్వతంగా నా ఇంట్లోనే ఉంటుందని ప్రతిసవాల్ చేస్తుంది. దీంతో ఇద్దరూ అగ్రిమెంట్‌పై సంతకాలు చేస్తారు.
ఇక రామరాజు ఇచ్చిన శపథాన్ని ఎలాగైనా నెరవేర్చాలని నిర్ణయించుకోగా భద్రావతి, సేనాపతి మాత్రం ఈ పెళ్లి జరగకుండా ప్రేమను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెడతారు. మరోవైపు ప్రేమ కూడా ధీరజ్‌తో వెళ్లాలా వద్దా అనే విషయంలో ఆలోచనలో పడుతుంది. రెండు రోజుల్లో పెళ్లి చేసి భద్రావతి సవాల్‌ను రామరాజు నెగ్గుతాడా.. లేక ప్రేమను తన ఇంట్లోనే ఉంచుకుని భద్రావతి గెలుస్తుందా అన్నది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌లో వరకు ఆగాల్సిందే.
[Illu Illalu Pillalu today episode 584, Star Maa Illu Illalu Pillalu September 20 episode, Illu Illalu Pillalu Ramaraju challenge Bhadravathi, Illu Illalu Pillalu Dheera j Prema marriage twist, Illu Illalu Pillalu police station episode update]




