Home

»

Tv News

Illu Illalu Pillalu:  భాగ్యం కుటుంబం చేసిన తప్పులని రామరాజు మన్నిస్తాడా!

Oct 11, 2026 8:34AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -602 లో... శ్రీవల్లి చేసిన కుట్రలు, మోసాలన్నీ రామరాజు ముందు బయటపడటంతో ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. రోల్డ్ గోల్డ్ గొలుసును ఒరిజినల్ బంగారంగా చెప్పడం,..ఎంఏ ఇంగ్లీష్ అంటూ ఫేక్ సర్టిఫికేట్ చూపించడం, అమూల్య జీవితాన్ని నాశనం చేయడానికి భద్రవతితో కలిసి పన్నిన కుట్రలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటపడ్డాయి. దీంతో రామరాజు కోపంతో ఊగిపోయి శ్రీవల్లి చెంప చెళ్లుమనిపించి "ఇంట్లో నుంచి వెళ్లిపో" అని ఆర్డర్ వేశాడు. ఆ రోజు అమూల్య విషయంలో తనకు గుండెపోటు రావడానికి కారణం కూడా శ్రీవల్లే అని వేదవతి ఫైర్ అవ్వడంతో, శ్రీవల్లి రామరాజు కాళ్లపై పడి "మొదటి తప్పు అని క్షమించండి మామయ్యా" అని బతిమిలాడినా కూడా రామరాజు కనికరించలేదు. దీంతో ప్రేమ సుక్కుకి ఫోన్ చేసి శ్రీవల్లి తల్లిదండ్రులు భాగ్యం, ఆనందరావులను పిలిపించింది.

భాగ్యం, ఆనందరావు ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే శ్రీవల్లి తెలివిగా తన తల్లిదండ్రులపైనే నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అంకుల్ నేను మోసం చేయలేదు, వంద అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు కదా అని మా అమ్మానాన్నే నాలుగు అబద్ధాలు ఆడారు, నా పెళ్లి బాగుండాలని నేను వాళ్ల మాట విన్నాను అంతే అంటూ చందు ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ కొత్త డ్రామా మొదలుపెట్టింది. చందు కూడా ఆమె మాటలకు కాస్త కరిగినట్లు కనిపించాడు. దీనికి భాగ్యం కూడా వంత పాడుతూ.. అవును బావగారు, ఆడపిల్ల తల్లిదండ్రులుగా గత్యంతరం లేక అబద్ధాలు చెప్పాం, బంగారం లేదని తెలిస్తే సంబంధం కుదరదని ఇలా చేశామంటూ హార్ట్ ఎటాక్ డ్రామాలతో సహా కొత్త కథలు చెప్పడం మొదలుపెట్టింది. గతంలో కూడా చందు నిజం చెప్పేస్తాడేమోనని ఆనందరావు హార్ట్ ఎటాక్ డ్రామా ఆడిన విషయం తెలిసిందే.

కానీ రామరాజు ఈ డ్రామాలను నమ్మలేదు. ఒక మంచి బంధాన్ని కలపడం కోసం చిన్న అబద్ధం ఆడొచ్చు అన్నారు పెద్దలు, కానీ మోసాల మీద మోసాలు చేసి, బంగారాన్ని, చదువులను కూడా అబద్ధం చెప్పి పెళ్లి చేయమని ఎవరూ చెప్పలేదంటూ ఆనందరావు చెంప పగలగొడతాడు రామరాజు. దీంతో భాగ్యం రెచ్చిపోయి ఎదురుదాడికి దిగింది. తప్పు చేసినోళ్లు ఈ ఇంట్లో ఉండకూడదు అనేది మీ ఇంటి రూల్ అయితే.. మీ చిన్న కొడుకు సాగర్ దొంగచాటుగా నర్మదను పెళ్లి చేసుకున్నాడు..‌మీ కూతురు అమూల్య విశ్వతో లేచిపోయింది.. మరి వాళ్లను కూడా ఇంట్లో నుంచి గెంటేయండి.. మా కూతుర్ని మాత్రమే ఎందుకు అంటున్నారంటూ వేదవతిని భాగ్యం నిలదీసింది. దీంతో ఇంట్లో మాటల యుద్ధం మరింత ముదిరింది. రామరాజు తన నిర్ణయానికి కట్టుబడి ఉంటాడా? చందు శ్రీవల్లి మాటలు నమ్మి ఆమెకు మళ్లీ ఛాన్స్ ఇస్తాడా? అనేది రేపటి ఎపిసోడ్ లో తేలనుంది.

 

 

[illu illalu pillalu serial 602 episode, telugu tv serial, illu illalu pillalu serial on star maa, illu illalu pillalu saturday episode, illu illalu pillalu serial 10th october episode]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com