
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు Illu illalu pillalu. ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ 566లో.. రైస్ మిల్‌లో పోయిన ఆరు లక్షల డబ్బులతోనే తిరుపతి తనకు బంగారం చైన్ కొనిచ్చాడని వేదవతితో సుకన్య చెప్తుంది. అయితే తన తమ్ముడు తిరుపతి ఎలాంటి తప్పు చేయడని అనవసరంగా అతనిపై నిందలు వేస్తే ఊరుకోనని వేదవతి సుకన్యపై కోప్పడుతుంది. ఇదే సమయాన్ని అనుకూలంగా మార్చుకున్న వల్లి, అమాయకురాలినైన తనపై నిందలు వేస్తున్నారంటూ దొంగ ఏడుపులు మొదలుపెడుతుంది. ఈ చైన్ వెనుక ఉన్న అసలు నిజాలు తేలేవరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని ముఖ్యంగా తన భర్తకు కూడా తెలియకూడదని వల్లికి గట్టి వార్నింగ్ ఇస్తుంది వేదవతి.
వేదవతి వెళ్ళిపోయిన తర్వాత వల్లి లోలోపల ఎంతో సంతోషిస్తుంది. ఒకవైపు మిల్‌లో డబ్బులు పోయిన విషయం బయటకు చెప్పొద్దని భర్త అనడం.. మరోవైపు చైన్ విషయం ఎవరికీ చెప్పొద్దని అత్త అనడంతో.. ఇంట్లో త్వరలోనే పెద్ద రచ్చ జరగబోతోందని సంబరపడుతూ డ్యాన్స్ చేస్తుంది వల్లి. మరోవైపు, అమూల్య తన కోపాన్ని పక్కనపెట్టి విశ్వాతో కలిసి బైక్‌పై రెస్టారెంట్‌కు వెళ్తుంది. అక్కడ విశ్వా స్నేహితులు అమూల్యను వదినా అని పిలవడంతో ఆమె కోప్పడుతుంది. అయితే విశ్వా సర్దిచెప్తాడు. ఇద్దరూ కలిసి ఐస్ క్రీమ్ తినడానికి కూర్చుంటారు.
రెస్టారెంట్‌లో రద్దీ ఎక్కువగా ఉండటంతో విశ్వా స్నేహితుడు ఒక ప్లాన్ వేస్తాడు. ఫోన్ తీసి.. మీ అమ్మాయి లవర్‌తో వచ్చిందోయ్ అని ఎవరో తండ్రితో మాట్లాడుతున్నట్లు నటిస్తాడు. దాంతో అక్కడ ఉన్న ప్రేమికులంతా భయపడి పారిపోవడంతో రెస్టారెంట్ ఖాళీ అవుతుంది. మరోవైపు ఆరు లక్షల దొంగతనం నేరం తిరుపతిపైనే పడుతుంది. తన జీవితాన్ని త్యాగం చేసిన అక్కే తనను దొంగగా చూడటంతో తిరుపతి ఎమోషనల్ అవుతాడు. అంతలా తిరుపతి కన్నీరు పెట్టుకున్నప్పటికీ రామరాజు మాత్రం అతనిపై కోపంగా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






