Home

»

Tv News

Illu Illalu Pillalu: ప్రేమ ఫస్ట్ నైట్ ప్లాన్ ఫెయిల్.. ధీరజ్ షాకింగ్ నిర్ణయం!

Oct 4, 2026 12:17PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -596 లో....సాగర్, ధీరజ్, చందు, తిరుపతి నలుగురు మందు తాగుతూ పెళ్లాల గురించి మాట్లాడుకుంటారు. ధీరజ్ తక్కువ తాగితే .. ఏంట్రా నీ పెళ్లానికి భయపడుతున్నావా? అని సాగర్ అంటాడు. అప్పుడే అక్కడ నర్మద వచ్చి నిలబడటం చూసిన ధీరజ్.. వదిన నిన్ను కొట్టకుండా చూసుకోమని సాగర్ కు చెప్తాడు.

దీంతో సాగర్ రెచ్చిపోయి.. నేను మీ వదినకు భయపడటం ఏంట్రా, నా మాట వింటే చాలు వణికిపోతుంది, నా కళ్లలోకి కూడా చూడలేదని బిల్డప్ ఇస్తాడు. అయితే ఆ ముక్క వెనక్కి తిరిగి చెప్పమని ధీరజ్ అనగానే వెనక్కి తిరిగి నర్మదను చూసి సాగర్ భయపడిపోతాడు. నర్మద అందరికీ క్లాస్ ఇచ్చి ఎవరి గదులకు వాళ్లను వెళ్లమంటుంది. డార్లింగ్ మనం వెళ్దాం పదా అని నర్మదను సాగర్  తీసుకెళ్తాడు. ఆడికే పెళ్లామా నాకు లేదా అని ధీరజ్, నాకు పెళ్లాం ఉంది కబుర్లు చెప్పుకుంటానని చందు, తిరుపతి కూడా వెళ్లిపోతారు.

మరోవైపు ప్రేమ చీర కట్టుకుని అందంగా రెడీ అయి ధీరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మత్తులో వచ్చిన ధీరజ్ ప్రేమను చూసి.. సారీ అండీ మా రూం అనుకుని వచ్చేశానని వెళ్లిపోతుంటే ఇది మన గదే అని ప్రేమ ఆపుతుంది. ఎప్పుడూ లేనిది ఒకేసారి ఇంత హాట్ గా ఉన్నావేంటే అని ధీరజ్ అడిగితే "నీ కోసమే" అని ప్రేమ సిగ్గుపడుతుంది. ఆ తర్వాత ధీరజ్ తాగాడని గుర్తించి.. ఫస్ట్ నైట్ రోజు ఎవరైనా తాగొస్తారా అని ప్రేమ కొడుతుంది.

అదే టైంలో చందు మత్తులో వల్లీ దగ్గరకు రాగా.. బావ నా కుట్రలన్నీ తెలిసిపోయాయా అని వల్లీ టెన్షన్ పడుతుంది. చందు దగ్గరకు తీసుకోవడంతో .. రోజుల తర్వాత బావ దగ్గరకు తీసుకుంటున్నాడని ఒకవైపు సంతోషం.. రేపు నా బండారం బయటపడుతుందని మరోవైపు టెన్షన్ తో వల్లీ తిట్టుకుంటుంది. సాగర్ కూడా నర్మదను దగ్గరకు తీసుకుంటాడు, కొత్త పెళ్లికొడుకు తిరుపతి సుకన్య దగ్గరకు వెళ్తాడు.

అసలు ట్విస్ట్ ఇక్కడే.. మా నానమ్మ త్వరగా పాపనో బాబునో ఇచ్చేయ్ అంది, ఇచ్చేద్దామని ధీరజ్ తో ప్రేమ అంటుంది. దానికి ధీరజ్.. నీ ఎస్ఐ కల అయ్యాక పిల్లల్ని కందాం, మనమే పిల్ల బచ్చాలం, మనకి ఇప్పుడే పిల్లలు ఎందుకని ఆపుతాడు. దీంతో ప్రేమ డిసప్పాయింట్ అవుతుంది. ఉదయం లేచి ప్రేమ ముగ్గులు వేసి తులసి కోటకు పూజ చేయడం చూసి నర్మద షాక్ అవుతుంది. ఓయ్ ఎవరమ్మా నువ్వు అని సెటైర్లు వేస్తూ ఫస్ట్ నైట్ గురించి అడుగుతుంది. పోలీస్ అయ్యే వరకు వద్దన్నాడని ప్రేమ చెప్పగానే పోలీస్ అవ్వకపోతే మీ పరిస్థితి ఏంటని నర్మద నవ్వుతూ సెటైర్ వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com