Home

»

Tv News

డియర్ కిల్లర్ ఏమయ్యింది !

May 08, 2026


 

గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న నటి జ్యోతి పూర్వజ్. జగతి మేడం రోల్ లో ఈ సీరియల్ లో అద్భుతంగా నటించింది. అలంటి జ్యోతి పూర్వాజ్ త్వరలో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతోంది. ఐతే మరి ఏమయ్యిందో ఏమో ఆమె హాస్పిటల్ బెడ్ మీద సర్జరీ గౌన్ లో కనిపించింది. ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసరికి నెటిజన్స్ ఆమె ఫాన్స్ అంతా షాకైపోయారు. దాంతో అందరూ కామెంట్స్ పెడుతూ ఉన్నారు. "అయ్యో మేడం ఏమయ్యింది, డియర్ మేడం ఏమయ్యింది, మీ ఆరోగ్యం బాగుంది కదా ?, స్పీడీ రికవరీ, గాడ్ బ్లెస్స్  యు, ఏమయ్యింది టీచరమ్మ,  జాగ్రత్తగా ఉండండి" అంటూ చెప్తున్నారు.

ఐతే విషయం కూడా ఇందులో చెప్పింది. త్వరలో కిల్లర్ అనే మూవీ ద్వారా జ్యోతి పూర్వజ్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతున్న తరుణంలో ఒక హాస్పిటల్ షూటింగ్ సందర్భంగా ఈ విధమైన గెటప్ లో కనిపించింది అని తెలుస్తోంది. అలాగే ఈ పిక్ పక్కన ఒక కాప్షన్ కూడా పెట్టింది. "రిలీజ్ డేట్ కి దగ్గర పడుతున్నాం. త్వరలో మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం.

ప్రొడక్షన్ హౌసెస్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నాయి" అని చెప్పింది. జ్యోతి పూర్వజ్ అసలు పేరు జయశ్రీ రాయ్ కేకే. తర్వాత జ్యోతి పూర్వాజ్ గా పేరు మార్చుకుంది. ఇక ఆమె లేటెస్ట్ అప్ డేట్స్ అన్నీ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో పోస్ట్ చేస్తూ ఉంది.  

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com