
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... శేషుకి కావాలనే జానూ గురించి చెప్తాడు సింహాద్రి. తనకి ఆల్రెడీ లవర్ ఉన్నాడు. అసలు మీ సంజుని ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా అంటూ శేషుని రెచ్చగొడతాడు సింహాద్రి. దాంతో శేషు ఫుల్ గా డ్రింక్ చేసి ఇంటికి వెళ్లి అందరిని పిలిచి ఈ జానూ గురించి ఇప్పుడు తెలియాలి.. నువు ఎవరు ఎక్కడ నుంచి వచ్చావ్.. అసలు మీరు పెళ్లి చేసుకున్నారా అని అడుగుతాడు. అప్పుడే సంజు వచ్చి ఏంటీ బాబాయ్ నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావని కోప్పడతాడు.
తాతయ్య తన మాటలు ఏం పట్టించుకోకండి అని సంజు అంటాడు. రమణి నువ్వు శేషు ని తీసుకొని వెళ్లు అని శివుడు అంటాడు. అతనికి డౌట్ రావడం లో తప్పు లేదు.. ఎందుకంటే ఎవరికీ మీ పెళ్లి గురించి తెలియదు కదా అందుకే రిసెప్షన్ జరిపించాలి అనుకున్నామని శివుడు, పార్వతి అంటారు. రిసెప్షన్ రోజు నైట్ మీకు శోభనం అని శివుడు చెప్పగానే ఇప్పుడు అవన్నీ అవసరమా అని సంజు అంటాడు. మరొకవైపు ఏంటి బావ బయట ఎక్స్ ట్రాలు చేస్తున్నావని నందు కోప్పడుతుంది. నువ్వు మెడలో తాళి తీసావ్ వాళ్ళు గమనిస్తారని త్వరగా లోపలికి పంపించానని మురళి అంటాడు. అయ్యో అంటూ త్వరగా బ్యాగ్ లో ఉన్న తాళిని మెడలో వేసుకుంటుంది. తాళికి విలువ ఇవ్వు అని మురళి అనగానే తాళి ఉంటే నాకు అక్కడ ఉద్యోగం ఉండదని నందు చెప్తుంది.
ఆ తర్వాత జానూ గదిలోకి వెళ్లి బెడ్ పై పడుకుంటుంది. ఏంటి ఇలా సరాసరి వచ్చి బెడ్ పై పడుకున్నావని సంజు కోప్పడతాడు. మనం వేరు వేరు పడుకుంటే అందరికి డౌట్ వస్తుందని జానూ అంటుంది. బెడ్ ని ఇద్దరు రెండు భాగాలు గా వేరు చేసుకుంటారు. మరొకవైపు నందు ఆఫీస్ కీ డ్రెస్ లో వెళ్తుంది. నా భార్యకి దిష్టి తగులుతుందని మురళి దిష్టి చుక్క పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
SEO Keywords:





.webp)
