
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి Godhavari. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 97 లో ఎందుకు సూర్య.. నన్ను ఇంత మోసం చేశావని సూర్యను జాను నిలదీస్తుంది. ఇప్పుడు అవన్నీ నేను చెప్పలేను, ఇప్పుడు ఏం మాట్లాడలేనని సూర్య అంటాడు. ఎందుకు సూర్యా, వాళ్లు నిన్ను ఏమైనా బెదిరించారా అని జాను అడుగుతుంది.
అప్పుడే జానూపై భువన కోప్పడుతుంది. ఏంటే నీ దబాయింపు, వెళ్లిపో అని అంటుంది. అప్పుడే అక్కడికి సింహాద్రి వస్తాడు. నీలాగే నీ మేనల్లుడు కూడా మోసగాడు అని జానూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇప్పుడు మీకు సంతోషమా అని సూర్య ఎమోషనల్ గా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మురళి, జానూ వెళ్తుండగా తోటలో నిత్య - సూర్య పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండడం చూస్తారు. అవి చూసి జాను లోపలికి వెళ్లి కుర్చీలన్నీ తీసేస్తుంది. అప్పుడే సింహాద్రి అసిస్టెంట్ వచ్చి.. అమ్మా, మీతో మాట్లాడాలని పక్కకు తీసుకెళ్తాడు. అసలు మీ నాన్న చావుకి కారణం సింహాద్రి అని జరిగింది మొత్తం చెప్తాడు. దీంతో మురళి, జాను షాక్ అవుతారు.
ఆ తర్వాత జానూ ఇంటికి వెళ్లి జరిగింది మొత్తం చెప్తుంది. శంకర్ చావుకి కారణమైన సింహాద్రిపై అందరూ కోపంగా ఉంటారు. జాను లాయర్ కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. మనకు న్యాయం జరగాలంటే ఇప్పుడు ఊళ్లోకి కొత్త ఇన్స్పెక్టర్ వస్తున్నారు.. ఆవిడను కలిసి కంప్లైంట్ ఇవ్వాలని లాయర్ చెప్తాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకని శారద భయపడుతుంది. మరోవైపు నిత్యను పెళ్లి కూతురుగా చేస్తారు. మరోవైపు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి జాను స్టేషన్ కి వెళ్తుంది.
తరువాయి భాగంలో పెళ్లి మండపం దగ్గరికి పోలీసులను తీసుకొని జాను వెళ్తుంది. ఈ పెళ్లి ఆపడానికి రాలేదు.. మా నాన్న చావుకి కారణమైన సింహాద్రిని అరెస్ట్ చేయించడానికి వచ్చానని జాను అనగానే అందరు షాక్ అవుతారు. సాక్ష్యాలు ఉన్నాయా అని సింహాద్రి అడుగుతాడు. అప్పుడే సింహాద్రి అసిస్టెంట్ ను పిలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






