స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -83 లో..... జాను బయటకు వెళ్తుంటే సింహాద్రి వస్తాడు. ఎందుకు నా కొడుకుని అరెస్ట్ చేయించారని కోప్పడుతాడు. నీ కొడుకు తప్పు చేసాడు అందుకే అరెస్ట్ చేయించామని జాను చెప్తుంది. అనవసరంగా నా జోలికి వస్తున్నావ్.. మీ అంతు చూస్తానని సింహాద్రి వార్నింగ్ ఇస్తాడు. ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి.. లేదంటే మా అక్క వస్తే మెడ పట్టుకొని గెంటేస్తుందని జాను చెప్తుంది.
మరొకవైపు జాను కోసం సూర్య వెయిట్ చేస్తాడు. అప్పుడే జానూ వస్తుంది. గోదావరి అమ్మాయి కోసం ఈ పడవబ్బాయి గిఫ్ట్ తీసుకొని వచ్చాడని తను కొన్న చీర ఇస్తాడు. ఇప్పుడు ఇవ్వన్ని ఎందుకు.. ముందు మీ అమ్మని ఒప్పించమని జాను అంటుంది. నేను అవన్నీ చూసుకుంటానని సూర్య అంటాడు. అదంతా నిత్య చూస్తుంది. కార్ స్పీడ్ గా వెళ్తుంది. దాంతో జానూకి సూర్య చీర ఇస్తుంటే చీర కింద పడిపోతుంది. అది చూసి సూర్య తనపై కోప్పడతాడు. ఏంటి బావ అని నిత్య అనగానే నువ్వు నిత్య అని సూర్య అడుగుతాడు. అవును బావ అని నిత్య చెప్తుంది. ఆ సింహాద్రి కూతురు కదా.. ఆ మాత్రం పొగరు ఉంటుంది కదా అని జాను అంటుంది.
చీరపై కాలు పెట్టబోతుంటే జాను కోప్పడుతుంది. ఆ చీర తీసుకొని అక్కడ నుంచి జాను వెళ్తుంది. మరొకవైపు మురళికి ఒంటి నిండా దెబ్బలున్నాయి. వేడి నీళ్ల కాపాడం పెట్టాలని శారద అంటుంది. నందుని పిలిచి పెద్దావిడ మురళికి వేడి నీళ్ల కాపాడం పెట్టమని చెప్తుంది. దాంతో మురళి దగ్గరికి నందు వెళ్తుంది. నందు తనకి సేవలు చేస్తుంటే మురళి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Godhavari, Star Maa Serials, Godhavari Latest Episode, Surya, Jaanu




