Home

»

Tv News

Godhavari : పీటల మీద పెళ్లి ఆపిన భువన.. జాను చెంతకి సూర్య!

Sep 1, 2026 10:05AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి Godhavari. ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్  99 లో ఏం జరిగిందంటే...మా నాన్నచావుకి కారణం సింహాద్రి అంటూ జరిగిందంతా ఇన్‌స్పెక్టర్ అశ్వినికి చెప్పి.. సింహాద్రిని అరెస్ట్ చేయడానికి జాను వెళ్తుంది. అక్కడ సింహాద్రి అసిస్టెంట్ చెప్పిన సాక్ష్యంతో అశ్విని అతన్ని అరెస్ట్ చేయాలని అనుకుంటుంది.

 

నాన్న వాళ్ళకి డబ్బే కదా కావాలి.. వాళ్ళ మొహాన కొట్టండి అని నిత్య అంటుంది. దీంతో జాను, శారద వాళ్ళని అశ్విని పక్కకు తీసుకెళ్లి ఇప్పుడు మీ నాన్న కష్టార్జితం ఇస్తున్నారు.. కేసు ఇవన్నీ వద్దని అంటుంది.అవును ఇప్పుడు కిన్నెర ఆపరేషన్ ముఖ్యం అని నందు చెప్తుంది. ఇప్పుడు మీకు డబ్బు అవసరం ఉంది కదా.. ఈ డబ్బు తీసుకోండి. మనం సింహాద్రిని అయితే వదిలే ప్రసక్తే లేదని అశ్విని మాటిస్తుంది. నాన్న వాళ్ళకి చెక్ ఇవ్వమని నిత్య చెప్పగానే సింహాద్రి చెక్ ఇస్తాడు. దాంతో జాను వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

 

ఆ తర్వాత జాను వాళ్ళు ఇంటికి వెళ్తారు. జరిగింది గుర్తుచేసుకుని శారదా ఏడుస్తుంది. మరోవైపు జానూ ఒంటరిగా కూర్చుని ఏడుస్తుండగా.. అప్పుడే మురళి వచ్చి బాధపడకు అని చెప్తాడు. బావా.. ఇక నా జీవితంలో ప్రేమకి చోటు లేదు.. నా కుటుంబమే నాకు ముఖ్యమని జాను అంటుంది. మరోవైపు పెళ్లి జరుగుతుండగా .. ఒరేయ్ సూర్య లేరా అని భువన అనగానే అందరు షాక్ అవుతారు. సూర్య పీటలపై నుంచి లేచి వస్తాడు. ఇన్నాళ్లు నువ్వు మంచివాడివి అనుకున్నా కానీ ఇలాంటివాడివి అనుకోలేదు. నీ కూతురు కూడా నా కొడుకు కాలర్ పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. ఇలాంటి ఇంటికి నా కొడుకు అల్లుడిగా వద్దు అని భువన చెప్పి సూర్యని తీసుకుని వెళ్తుంది.

 

తరువాయి భాగంలో కిన్నెరని తీసుకుని జానూ వాళ్ళు హాస్పిటల్ కి వెళ్తారు. వాళ్ళని వెతుక్కుంటూ సూర్య కూడా వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com