
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న గోదావరి Godhavari. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 104లో.. సూర్య వస్తున్నాడని మురళి, వెంకట్రావు పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తారు. ఏమైంది అలా వస్తున్నారని జానూ అడిగితే ఒక ఆంబోతు వెంటపడిందని మురళి కవర్ చేస్తాడు. ఎన్ని వీధులు పరిగెత్తించిందో అంటూనే వెంకట్రావ్ వైపు చూసి అతను కనిపించాడని చెప్పొద్దు ప్లీజ్ అంటూ సైగ చేస్తాడు. ఒళ్లంతా నొప్పులు అని మురళి అంటుంటే వేడి నీళ్ల కాపడం పెట్టాలా అని లక్కీ అడుగుతుంది. నొప్పులు నాక్కూడా ఉన్నాయని వెంకట్రావు అనడంతో భర్తని అలా చూసుకోవాలని బామ్మ నందుతో అంటుంది. అది నా భార్య అని వెంకట్రావు అంటాడు.
మురళి దగ్గరికి నందు వేడి నీళ్ల కాపడం పెట్టేలోపే లక్కీ వెళ్లి పెట్టడంతో నందుకి కోపం వస్తుంది. మీ ఆయనకి కూడా నొప్పులతో బాధపడుతున్నాడని నందు అంటుంది. ఇదే సమయంలో కిన్నెర డల్ గా కూర్చుని నాన్న గుర్తు వస్తున్నాడని.. మొన్న కళ్లు తిరిగి పడిపోయినప్పటి నుంచి ఏదోలా ఉందని బాధపడితే నీకేం కాదమ్మా అని అందరు తను నవ్వేలా చేస్తారు. కుటుంబమంతా కిన్నెరకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది.
ఆ తర్వాత మురళి బోటిక్ పెట్టుకోవడానికి షాప్ కోసం నందు, మురళి, లక్కీ వెళ్తారు. రెంట్ ఎక్కువ చెప్పడంతో మురళి కళ్లు తిరిగిపడిపోతాడు. అయ్యో బావా ఆ మాత్రం ఉండదా అని నందు అంటే.. సింహాద్రి ఇచ్చిన డబ్బుల్లో నుంచి అడ్వాన్స్ ఇద్దామని నందు అనగానే కిన్నెర ఆపరేషన్ కి ఎంత అవుతుందో తెలియదు కదా అని మురళి ఆపుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






