
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి Godhavari. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 100లో..సింహాద్రి గురించి నిజం తెలుసుకున్న భువన పెళ్లిని ఆపేస్తుంది. ఏంటి అత్తా ఇదంతా అని కళ్యాణ్ అడగగా.. అతని చెంప చెల్లుమనిపిస్తుంది భువన. నువ్వు ఆ గౌతమి విషయంలో చేసిన తప్పు నీకే తెలుసు. నువ్వేమో ఇలా.. మీ అక్క అలా, మీ నాన్న అయితే ఇంకా పెద్ద మోసగాడు అని నిలదీస్తుంది భువన. సూర్యని తీసుకొని భువన వెళ్తుంటే.. చెల్లెమ్మా నా గురించి నీకు తెలియదు అంటూ సింహాద్రి వార్నింగ్ ఇస్తాడు. నన్ను ఆ శారదా లాగే బెదిరించాలని అనుకుంటున్నావా.. అస్సలు భయపడను.. ఇక్కడ ఉంది భువన అని చెప్పి సూర్యని అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంది.
మరోవైపు శారద వాళ్లకు సింహాద్రి అసిస్టెంట్ ఫోన్ చేసి.. మీ గురించి చెప్తున్నా.. ఆ సింహాద్రి అస్సలు వదిలిపెట్టడు. ఊరు వదిలి వెళ్లిపోండి అని చెప్తాడు. దీంతో శారదా ఏడుస్తూ అందరికి చెప్తుంది. మనం వెళ్లిపోవడమే కరెక్ట్ అని జానూని నందు కన్విన్స్ చేస్తుంది. అందరు వెళ్లిపోవాలని డిసైడ్ అవుతారు. మరోవైపు నిత్య తన బావతో పెళ్లి కాలేదని ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. అప్పుడే సింహాద్రి వచ్చి.. ఏంటమ్మా నువ్వు చేస్తున్నది అని అడ్డుకుంటాడు. నాకు బావ కావాలని నిత్య అంటుంది. అప్పుడే కళ్యాణ్ వచ్చి.. ఆ జానూ వాళ్లు ఊరు వదిలి వెళ్లిపోతున్నారని చెప్తాడు.
అలా ఎలా వెళ్లిపోతారని సింహాద్రి అనుకుంటాడు. కోపంగా జానూకి ఫోన్ చేసి.. నాకు భయపడి వెళ్తున్నావా అని అంటాడు. ఎవడ్రా నీకు భయపడేది రా.. చూసుకుందామని జానూ అంటుంది. జానూ నువ్వు ఫోన్ కట్ చెయ్ అని నందు చెప్తుంది. ముందు అందరు ఆ సిమ్ తీసేయండి.. వాడికి మనం ఎక్కడ ఉన్నామో తెలియకూడదని నందు అంటుంది. ఆ తర్వాత.. వాళ్లపై మనం పగ తీర్చుకుందామని నిత్యకి సింహాద్రి చెప్తాడు.
తరువాయి భాగంలో జానూ వాళ్లు రూమ్ కోసం చూస్తుంటే.. మేం మీకు రూమ్ ఇవ్వం.. మీరు ఊళ్లో మోసం చేసి వచ్చారట.. మీ ఫొటోస్ సోషల్ మీడియాలో వచ్చాయని అతను అనగానే జాను షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






