స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -90 లో..... నందుకి మురళి చీర తీసుకొని వస్తాడు. అది చూసి ఏం బాలేదని మురళి మొహంపై నందు చీర విసిరేస్తుంది. దాంతో తనమీద పెద్దావిడ కోప్పడుతుంది.భర్త వంద రూపాయల చీర పెట్టి తీసుకొని వచ్చిన సరే అది అదృష్టమని పెద్దావిడ చెప్తుంది. ఆ తర్వాత నందు దగ్గరికి మురళి వస్తాడు. నందు నిజంగా ఆ చీర నచ్చలేదా అని అడుగుతాడు. నచ్చలేదని నందు అంటుంది.
ఎంత పెట్టి కొన్నావ్ ఏంటని నందు అనగానే రెండువేలు అని మురళి చెప్తాడు. ఏదో ఇరవై వేల రూపాయల చీర అన్నట్లు చెప్తావ్ ఏంటని నందు అంటుంది. మరొకవైపు జానూ వాళ్ళ నాన్న ఫోటో దగ్గరికి జాను వచ్చి ఏడుస్తుంది. తన మాటలు గుర్తు చేసుకొని ఏడుస్తుంది. నాకు సూర్య ప్రేమ నిజాయతి అనిపించింది. తనని పెళ్లి చేసుకుంటే నేను ఇక్కడే ఉండి అందరిని చూసుకోవాలి అనుకున్నానని జానూ ఎమోషనల్ అవుతుంది. నాన్న నువ్వు చెప్పినట్లు ఈ కుటుంబాన్ని నేనే చూసుకుంటానని జాను అనుకుంటుంది.
మరొకవైపు జాను ఫోటో చూస్తూ సూర్య బాధపడుతాడు. ఆ తర్వాత ఇంట్లో వరలక్ష్మి వ్రతం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. మురళి తీసుకొని వచ్చిన చీరని నందు కట్టుకుంటుందో లేదోనని మురళి టెన్షన్ పడుతాడు. మురళి తీసుకొని వచ్చిన చీరనే నందు కట్టుకొని వస్తుంది. దాంతో మురళి హ్యాపీగా ఫీల్ అవుతాడు. నందు వరలక్ష్మి వ్రతం చేస్తుంది. మురళి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తర్వాత కిన్నెరకి ఆపరేషన్ ఎలా చేయించాలని అందరు ఆలోచిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Godavari serial, Star Maa serial updates, Nandhu Murali Telugu serial, Janu Surya emotional scenes, TeluguOne entertainment




.webp)
