Home

»

Tv News

Godavari serial: జానూని అవమానించిన నందు, గౌతమి.. శోభనం గదిలో సంజయ్.!

Oct 25, 2026 12:04PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్- 147లో పుట్టింటి గొడవ పీక్స్ కి చేరింది. జాను తన ఆపరేషన్ కి సింహాద్రి ఇచ్చిన డబ్బులో మిగిలిన డబ్బు తినేసిందని ఇంట్లో అందరి ముందు నందు ఆరోపిస్తుంది. ఆపరేషన్ కి ఎంత అయింది.. మిగిలిన డబ్బు ఏం చేసింది లెక్కలు అడగాలని తల్లి రేణుకని, గౌతమిని రెచ్చగొడుతుంది నందు. జాను నాలుగు లక్షల్లో ఆపరేషన్ కి రెండు లక్షలు మాత్రమే అయిందని.. మిగిలిన రెండు లక్షలు తన కోసం దాచుకుందని నందు అనుమానిస్తుంది. ఈ మాటలతో జాను తీవ్రంగా బాధపడుతుంది.

అదే సమయంలో గౌతమి కూడా జానుపై విరుచుకుపడుతుంది. సింహాద్రి ఇచ్చిన డబ్బుపై తనకు, నందుకి కూడా హక్కు ఉందని వాదిస్తుంది. నా కాలేజ్ ఫీజు ఎవరు కడతారు.. కిన్నెర బతుకేం కావాలని ప్రశ్నిస్తుంది. మీ అత్తింట్లో తినగా మిగిలినవి మాకు పెట్టడానికి.. మీ ఇంట్లో అంట్లు తోమడానికి మమ్మల్ని పనిమనుషుల్లా వాడుకుంటున్నావా అంటూ జానుని అవమానిస్తుంది. తనని డబ్బున్న వాడిని చేసుకుని జల్సాగా బతుకుతుందని, పుట్టింటి బాధ్యత మరిచిపోయిందని నందు కూడా నిప్పులు చెరుగుతుంది. దీంతో రేణుక కూడా జానుని లెక్కలు అడగమని గట్టిగా అడుగుతుంది.

మరోవైపు పుట్టింటి ఆర్థిక ఇబ్బందుల కోసం నందు ఉద్యోగ వేట మొదలుపెట్టింది. ఇంటి బాధ్యత తానే పెద్ద కొడుకులా తీసుకుంటానని చెప్పి ఇంటర్వ్యూకి బయలుదేర్తుంది. జాను వెళ్లిపోయిందని.. బావ సంపాదన సరిపోదని తనే జాబ్ చేయాలని నిర్ణయించుకుంటుంది. మురళి తన భార్య నందు కోసం తన స్కూల్ ప్రిన్సిపల్ కాళ్లు పట్టుకుని మరీ 50 వేలు అడ్వాన్స్ తీసుకుంటాడు. ఇంటి అవసరాల కోసం తీసుకున్న ఆ డబ్బుని నందుకి ఇచ్చినా, నందు మాత్రం మురళీని భర్తగా ఒప్పుకోకుండా ఇంకా బావ అని పిలుస్తూ దూరంగా ఉంటుంది.ఇక అత్తింట్లో జాను పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. సంజయ్ తో తన శోభనం జరిగినట్లు ఊహించుకుంటూ సిగ్గుపడుతుంది. సంజయ్ గదిలోకి వెళ్లి తలుపు వేసి, పాలు ఇచ్చి అతనితో సరదాగా మాట్లాడుతుంది. తనకి సపోర్ట్ చేసినందుకు థాంక్స్ చెప్తూ, మీలో కోపం మాత్రమే కాదు మంచి మనసు కూడా ఉందని, మీలాంటి వారి దగ్గర ఏ ఆడపిల్ల అయినా సంతోషంగా ఉంటుందని చెప్తుంది. శోభనం రోజు ఎవరు నిద్రపోతారు అంటూ సంజయ్ పై తన ఇష్టాన్ని పరోక్షంగా చెప్తుంది. కానీ సంజయ్ మాత్రం లైట్ ఆపేసి పడుకోమంటూ జానుని దూరం పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

[Godavari Serial Episode 147, Godavari Serial October 24 Episode, Godavari Serial Today Episode, Godavari Serial Latest Episode, Godavari Serial, Telugu TV News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com