Home

»

Tv News

డ్రామా జూనియర్స్ టైటిల్ విన్నర్ ప్రణీత్ కి 15 లక్షల కాష్ ప్రైజ్

Aug 22, 2026 5:12PM


డ్రామా జూనియర్స్ సీజన్ 9 విన్నర్స్ ని అనౌన్స్ చేసేసారు. ఈ వారం ఎపిసోడ్ లో చిన్నారులు చేసిన స్కిట్స్ అన్నీ కూడా బాగా హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ ఎపిసోడ్ కి నందమూరి  కళ్యాణ్ రామ్ వచ్చి షోని మరింత పాజిటివ్ గా మార్చారు. ఆయన కూడా పిల్లల స్కిట్స్ ని చూసి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇందులో అనిల్ రావిపూడిని తమ్ముడు అంటూ రాజాని లడ్డు ఆంటీని పిలుస్తూ హీరో శ్రీకాంత్ ని మామ అని పిలుస్తూ శ్రీవియా చేసిన స్కిట్ హైలైట్ అయ్యింది. ఇక కళ్యాణ్ రామ్  హోస్ట్ సుధీర్ మీద సరదాగా వేసిన జోక్స్ కి అందరూ నవ్వుకున్నారు.
ఫైనల్ గా  అనిల్ రావిపూడి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ నుంచి 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేశామని చెప్పి  వాళ్ళను స్టేజి మీదకు పిలిచారు.

హార్దిక్, ఆదిదేవ్, వైశాలి, యద్విశ్రీ, ప్రణీత్  సెలెక్ట్ అయ్యారు. ఇందులో సెకండ్ రన్నరప్ గా వైశాలి నిలిచింది.  రన్నరప్ గా ఆది దేవ్ సెలెక్ట్ అయ్యాడు.  టైటిల్ విన్నర్ గా ప్రణీత్ నిలిచాడు.  కళ్యాణ్ రామ్ టైటిల్ విన్నర్ ప్రణీత్ ని  హగ్ చేసుకున్నారు . అందరూ కంగ్రాట్యులేషన్స్  చెప్పారు.  "హ్యాపీ నా " అని కుర్రాడిని అడిగాను అతను చెప్పిన ఆన్సర్ నాకు నచ్చింది  అంటూ చెప్పారు కళ్యాణ్ రామ్ .  "ఇదీ స్పోర్ట్స్ మెన్ షిప్ అంటే. హ్యాపీనా అని అడిగినప్పుడు నా ఫ్రెండ్స్ తో కలిసి అవార్డు తీసుకోవచ్చా అని అడిగాడు " అంటూ చెప్పి చాలా సంతోషపడ్డారు. వెంటనే మిగతా చైల్డ్ కంటెస్టెంట్స్ అందరినీ స్టేజి మీదకు పిలిచారు. అలా అందరి మధ్యలో ప్రణీత్ కి అవార్డుని అందించారు కళ్యాణ్ రామ్.   టైటిల్ విన్నర్ కి 15 లక్షల కాష్ ప్రైజ్ ఇచ్చారు.  ఫస్ట్ రన్నరప్ గా నిలిచిన ఆది దేవ్ కి 2 లక్షలు  ,  సెకండ్ రన్నరప్ వైశాలి లక్ష కాష్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. ఇక ఈ డ్రామా జూనియర్స్ సీజన్ 9 ఇక్కడితో పూర్తయిపోయింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com