
కుక్కూ విత్ జాతిరత్నాలు సీజన్ 2 సరికొత్త స్పెషల్ డోస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఆ ప్రోమో ఫుల్ కలర్ ఫుల్ మోడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "జాతిరత్నాలు అసలు సిసలు దండయాత్ర మళ్ళీ మొదలవుతుందండి. ఈసారి నవ్వుల డోసు డబలు , రచ్చ ట్రిప్పులు, 2 టైమ్స్ ఎంటెర్టైన్మెంటు, 2 టైమ్స్ ఎంజాయిమెంటు, 2 టైమ్స్ హంగామా ..కుక్కూ విత్ జాతిరత్నాలు త్వరలో మీ స్టార్ మాలో " అంటూ ఒక అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ ప్రోమోలో అవినాష్, హరి, గోమతి, ఇమ్మానుయేల్, సుహాసిని, రీతూ చౌదరి వాళ్లంతా ఈ ప్రోమోలో కనిపించారు. ప్రస్తుతానికి ప్రోమో తప్ప ఎలాంటి డీటెయిల్స్ ని రివీల్ చేయలేదు. లాస్ట్ ఇయర్ సీజన్ 1 పూర్తి చేసుకుంది .
20 ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. ఫైనల్ గా సుజిత ధనుష్ టాప్ స్కోర్ తో విన్నర్ గా నిలిచి 10 లక్షల కాష్ ప్రైజ్ ని సొంతం చేసుకున్నారు. ఇక బాబా భాస్కర్ కూడా టాప్ కాంపిటీషన్ ఇచ్చారు. ఈ సీజన్ లో ప్రభాకర్, తనూజ గౌడ, బాబా భాస్కర్, యాష్మి గౌడ, శ్రీనివాస రావు, అవినాష్, హరి, ఇమ్మానుయేల్, ఆర్జే హేమంత్ వంటి వాళ్లంతా వచ్చి వంటలతో పాటు ఎంటర్టైన్ చేసి వెళ్లారు. జడ్జెస్ గా అలనాటి అందాల నటి రాధ, చెఫ్ సంజయ్ తుమ్మ, విలన్ గా నటించే ఆశిష్ విద్యార్ధి వాళ్లంతా వచ్చారు.






