భార్య కాళ్ళు కడిగిన పంచ్ ప్రసాద్...
on Jan 10, 2025
జబర్దస్త్ షోలో కామెడీతో ఎంతోమందిని అలరించిన పంచ్ ప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన కామెడీ పంచులు, ప్రాసలతో బుల్లితెర ఆడియెన్స్ ను బాగా నవ్విస్తూ ఉంటాడు. కానీ రియల్ లైఫ్‌లో పంచ్ ప్రసాద్ కిడ్నీ సంబంధిత సమస్యలతో తరచూ ఆస్పత్రులకు వెళ్తూనే ఉండేవాడు. ఎందుకంటే రెండు కిడ్నీలు పాడైపోవడంతో వెంటనే కొత్త కిడ్నీని అమర్చాలని డాక్టర్స్ చెప్పడంతో ప్రసాద్ ఎంతో స్ట్రగుల్ అయ్యాడు. ఇక అతనికి డయాలసిస్ చేస్తున్నా కూడా రకరకాల ఇంఫికేషన్స్ తో ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి చూడలేక భార్య సునీత తన కిడ్నీని దానం చేస్తానని ముందుకు వచ్చింది. అయితే చిన్న వయసు కావడంతో వైద్యులు కుదరదని చెప్పేశారు.
భర్తను బతికించుకోవడానికి ఆమె ఎన్నో కష్టాలు పడింది. ఈ విషయాన్ని పంచ్ ప్రసాద్ నే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఐతే ఫైనల్ గా కిడ్నీ డోనర్ దొరకడంతో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుని మళ్ళీ షోస్ కి వస్తున్నాడు పంచ్ ప్రసాద్. ఈ విషయాన్నీ చెప్తూ ఫామిలీ స్టార్స్ లో షోలో ప్రసాద్ తన భార్య కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకున్నాడు. తల్లీ తండ్రులు జన్మనిస్తే.. తన భార్య తనకు పునర్జన్మనిచ్చిందన్నాడు ప్రసాద్. తన భార్య తనతోనే ఉంటూ కుటుంబాన్నికంటికిరెప్పలా చూసుకుంటోంది అన్నాడు ప్రసాద్ . ఈరోజు ఇలా తాను ఆరోగ్యంగా లేచి తిరగడానికి కారణం తన భార్య అంటూ.. ఆమెకు తాను చేసే ఈ పని చాలా చిన్నదంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ అవుతోంది.