.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో చూస్తే అందులో ఉన్న రూమర్స్ వింటే పొట్ట చెక్కలయ్యేలా నావ్వ్వుకోవాల్సిందే. కిట్టి పార్టీ పేరుతో లేడీస్ తో సరదాగా చిట్ చాట్ చేసింది శ్రీముఖి. "మీరు ఫేస్ చేసిన కొన్ని రూమర్స్ గురించి మాట్లాడుకునే టైం వచ్చింది " అంది. "సోషల్ మీడియాలో ఒక రోజు సుహాసిని పబ్బులో ఎం చేసిందో తెలుసా " అని వచ్చింది. "అసలు నువ్వు పబ్బుకు వెళ్లే రకమే కాదన్న విషయం నాకు తెల్సు" అని శ్రీముఖి అనేసరికి "వెల్తానులే కానీ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో " అంటూ సుహాసిని శ్రీముఖి పరువు తీసేసింది.
"ప్రిన్సి నీకెప్పుడన్నా ప్రిన్సి ఆర్టిస్ట్ అయ్యింది అనే రూమర్ వచ్చిందా " అని అడిగింది. "నాకు ముగ్గురు పిల్లలు అని పెట్టారు కానీ నాకే తెలీదు నాకు ఎప్పుడు పిల్లలు పుట్టారో" అని చెప్పింది ప్రిన్సి. "నా లైఫ్ లో ఒక యాంబిషన్ ఉంది చంచలమ్మ లాంటి అమ్మాయి నాకు వైఫ్ గా రావాలి " అని హరి చెప్పాడు. ఇంతలో సోషల్ మీడియాలో వచ్చిన ఒక రూమర్ థంబ్ నెయిల్ ని ప్లే చేశారు. "రోడ్డు మీద ఆకతాయిల్ని చితకబాదిన నేత్ర " అని . వెంటనే హరి "నేత్ర లాంటి వైఫ్ కావాలన్నా ఇప్పుడు వద్దులే " అన్నాడు.
"యాక్టింగ్ కి బై బై చెప్పిన శోభా " అంటూ ఇంకో థంబ్ నెయిల్ ని ప్లే చేశారు. "అలాంటివి ఏమీ లేవు" అంటూ శోభా శెట్టి చెప్పింది. వెంటనే హరి "శోభా యాక్టింగ్ కి బై బై చెప్తే నేను కూడా బై బై చెప్పేస్తా " అన్నాడు. "నువ్వు ఎప్పుడు యాక్టింగ్ చేసావ్ అసలు " అంటూ మరో వైపు నుంచి అవినాష్ కౌంటర్ వేసాడు. "హైదరాబాద్ లో 5 కోట్ల విల్లా కొన్న సుజిత " అంటూ థంబ్ నెయిల్ వేశారు. "హౌస్ ఫంక్షన్ కి పిలవలేదు " అని శ్రీముఖి అడిగేసరికి "నేనే వెళ్లలేదమ్మా " అంటూ సుజిత చెప్పింది. దాంతో అందరూ పడీపడీ నవ్వేశారు.




.webp)
