Home

»

Tv News

Brahmamudi : ఇల్లు వదిలి వెళ్లిపోయిన మదన్.. రోడ్డు మీద రేఖ!

Sep 2, 2026 4:14PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1126 లో.....నేను నిన్ను తల్లిచాటు బిడ్డలా నమ్మాను మమ్మీ, నువ్వు చెప్తే ఇష్టం లేని ఇందుని పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకున్నానంటూ రేఖ ముందు కుప్పకూలిపోతాడు మదన్. నీ మీద అంత నమ్మకం.. ప్రేమ పెట్టుకుంటే నువ్వు నన్ను మోసం చేశావని నిలదీస్తాడు. లక్కీ గాడు అంటేనే నాకు నచ్చదు.. వాడు నా రూంలో ఉంటేనే కంపరంగా ఉంటుంది.. మాట వరసకి తమ్ముడు అంటేనే తట్టుకోలేకపోయేవాడిని.. అలాంటి వాడే నీ కన్నకొడుకు.. నా రక్తం పంచుకుని పుట్టాడని తెలిసేలా చేశావ్.. నేనే నీ లోకం అనుకున్నా కానీ నీకు ఇంకో లోకం ఉందని తెలిసిందంటూ మదన్ ఎమోషనల్ అవుతాడు. అదే సమయంలో రాజు వైపు తిరిగి నీ మీద నాకు కోపమే కానీ నిజం బయటపెట్టి నా కళ్లు తెరిపించావ్ థాంక్స్ అని చెప్తాడు మదన్.

ఆవేశంలో ఉన్నావ్ మదన్ అని రాజు సర్ది చెప్పబోయినా.. లేదు అన్నీ ఆలోచించే మాట్లాడుతున్నానంటూ మదన్ ఇల్లు వదిలి వెళ్లిపోవడానికి సిద్ధమవుతాడు. ఎక్కడికి వెళ్తావ్ అల్లుడు అని భ్రమరం, శేషు అడిగితే ఎక్కడికో వెళ్తాను.. మా మమ్మీని, ఈ లక్కీ గాడిని చూస్తూ ఇక్కడ ఉండలేనని తెగేసి చెప్తాడు. భ్రమరం పరిగెత్తుకుంటూ వెళ్లి భూషణ్‌తో నీ కొడుకుని ఆపవా అని అడుగుతుంది. దానికి భూషణ్ కోపంతో ఈ సమాజానికి మొహం చూపించలేకవాడు వెళ్తున్నాడు.. నేను వాడికి మొహం చూపించలేక రూం నుంచి బయటకు రావడం లేదు.. వాడు ఏం చేయాలనుకుంటున్నాడో చేయనివ్వు అంటాడు. దీనికి కారణమైన రేఖను మాత్రం వదిలిపెట్టొద్దని భ్రమరం రగిలిపోతుంది.

నడి రోడ్డు మీద రేయ్ మదన్ నన్ను వదిలి వెళ్లకురా.. నువ్వు లేకపోతే నేను ఎలా ఉండాలిరా అంటూ రేఖ ఏడుస్తూ వెంటపడుతుంది. దానికి మదన్ నీకు ఇంకో కొడుకు.. పెద్ద కొడుకు ఉన్నాడు కదా వాడితో ఉండు.. నా ఫ్రెండ్స్‌కి ఏం చెప్పాలి.. మా అమ్మకి ఇంకో కొడుకు ఉన్నాడు.. తండ్రి వేరే అని చెప్పాలా అని కఠినంగా మాట్లాడి వెళ్లిపోతాడు‌ మదన్.  ఇదంతా నీ వల్లే అంటూ రాజు కాలర్ పట్టుకుని ఏడుస్తుంది రేఖ. అప్పుడు పిన్ని బాధగా ఉందా.. నువ్వు ఎదుటివాళ్లని బాధపెట్టినప్పుడు వాళ్లు కూడా ఇలాగే ఏడ్చారు.. పాతికేళ్లుగా నా ఫ్రెండ్ లక్కీ ఎంత బాధపడ్డాడో.. పసికందుగా ఉన్నప్పుడు వదిలేశావ్.. అప్పుడు ఎంత ఏడ్చాడో ఎప్పుడైనా ఆలోచించావా.. కన్నకొడుకు అని తెలిసిన తర్వాత కూడా దగ్గరకు తీసుకోలేదు.. చేసిన తప్పులకు ఎవరైనా అనుభవించాల్సిందే అని రేఖకి గట్టిగా బుద్ధి చెప్తాడు రాజు.

మరోవైపు ఇంట్లో అపర్ణ మాట్లాడుతుంది.  అసలు ఆ రేఖ మనిషేనా.. కన్న కొడుకుని అలా వదిలేస్తుందా.. దానికి ఆస్తి మీద ఆశ ఉందని తెలుసు కానీ వాళ్ల అమ్మ కంటే క్రూరంగా ఉందని అపర్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సుభాష్ మాత్రం ఇప్పుడు రేఖ గాయపడింది.. దానికి కారణం మన రాజు.. మళ్లీ మన కుటుంబాన్ని ఏమైనా చేస్తుందేమోనని భయపడతాడు. దానికి అపర్ణ మనకు మన మనవడు ఉన్నాడు.. ఏం కానివ్వడు అని అపర్ణ ధైర్యం చెప్తుంది. ఇంతలో ఇందు వచ్చి కరెక్ట్‌గా చెప్పావ్ నానమ్మ.. ఇక రేఖ పతనం మొదలైంది.. రేపు మన బావ బర్త్ డే గ్రాండ్‌గా చేద్దామని ఇందు అంటుంది. వెంటనే చలపతికి ఫోన్ చేసి రేపు రాజు అసలైన బర్త్ డే.. ఇంట్లో సెలెబ్రేట్ చేయాలని తాతయ్య, నానమ్మ కోరుకుంటున్నారని ఇందు చెప్తుంది. దానికి చలపతి ఎవరికి చెప్పనని మాట ఇచ్చావ్ కదమ్మా అని కంగారుపడితే.. మా తాతయ్య, నానమ్మకి మాత్రమే చెప్పాను.. ఇంకెవరికి తెలియదని ఇందు అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 


 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com