
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1161 లో......ఐశ్వర్య లక్కీ పెళ్లి ఏర్పాట్లు ఇందు, రాజ్ దగ్గరుండి పనులు చూసుకుంటారు. ఈ క్రమంలో భ్రమరాంభ స్వాతి భర్త మదన్ ను తక్కువ చేసి మాట్లాడుతుంది. ఉద్యోగం చేయిస్తూ తను ఖాళీగా ఉన్నాడని అంటుంది . దీంతో స్వాతి .. తన భర్తను తక్కువ చేస్తే వెళ్లిపోతానని తెగేసి చెప్తుంది. స్వాతి మాటలకు ఇందు మద్దతుగా నిలిచి మదన్ ను అవమానించే వాళ్లే ఇంటి నుంచి వెళ్లాల్సి వస్తుందని భ్రమరాంభకు కౌంటర్ ఇస్తుంది. దీంతో రాజ్ కూడా రంగంలోకి దిగి భ్రమరాంభను ప్రశ్నిస్తాడు. వాతావరణం వేడెక్కగా అపర్ణ అందరిని శాంతింపజేస్తుంది. ఇక ఇందు తన అక్క ఐశ్వర్యకు నగలు ఇవ్వబోతే ఐశ్వర్య నిరాకరిస్తుంది.
తనకు బిజినెస్ పెట్టిస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఇదే సమయంలో భ్రమరాంభ కూడా నగలు అడగడంతో ఇందు ఒత్తిడికి గురై కన్నీళ్లతో బయటకు వెళ్తుంది. అపర్ణ ఇందును ఓదార్చి నేరుగా బిజినెస్ పెట్టే బదులు ముందు తన దగ్గరే పని చేయించి అనుభవం వచ్చాక పెట్టించమని సలహా ఇస్తుంది.
మరోవైపు లక్కీ పెళ్లికొడుకుగా ముస్తాబవ్వగా రేఖ దిష్టి తీసి భావోద్వేగానికి గురవుతుంది. లక్కీ నగలు వద్దని తమ్ముడికి ఇవ్వమని చెప్తాడు..ముహూర్తం దగ్గరపడి పంతులు పిలవగా లక్కీ సంతోషంగా వస్తాడు కానీ ఐశ్వర్య అసహనంగా వచ్చి.. పెళ్లి పీటలపై ఆగండి నేను ఈ పెళ్లి చేసుకోను.. ముందు అగ్రిమెంట్ రాసి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






