Home

»

Tv News

Brahmamudi : రాజు,ఇందు సరదాలు..‌ఐశ్వర్యపై లక్కీ ఫోకస్!

Sep 5, 2026 9:36AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  బ్రహ్మముడి Brahmamudi . ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్  1129 లో...ఇంత పెద్ద లడ్డునా అని రాజు షాక్ అవుతుంటే అడ్డగాడిద అను తగ్గిపోతుందని ఇందు కౌంటర్ వేయడంతో ఇంట్లో సందడి మొదలైంది. ఇది నీతోనే తినిపిస్తానంటూ రాజు, ఇందు వెంటపడి ఇల్లంతా పరుగులు పెట్టిస్తే.. ఆ సరదాను చూసి ఐశ్వర్య, రేఖకు మండిపోతుంది. మా కొడుకుని దూరం చేయరు కదా అని చలపతి అడిగితే దేవకికి కృష్ణుడు పుట్టిన యశోద పెంచినట్టే‌ రాజు మా ఇంట్లో పుట్టినా మీరు కంటికి రెప్పలా కాపాడారు..‌ వారసుడు అయినా ఎప్పటికి మీ కొడుకే అని అపర్ణ చెప్పి ఎమోషనల్ చేసింది.

 

మరోవైపు లక్కీ, ఐశ్వర్య మీద ఫోకస్ పెట్టాడు. స్విమ్మింగ్ పూల్ దగ్గర జ్యూస్ తీసుకొచ్చి ఇష్టమైన వాళ్లకు అడగకుండానే చేయాలి.. ఒక్కసారి బావా అని పిలవొచ్చు కదా అని నసపెట్టాడు. ఆధార్ కార్డులో పేరు వేయించుకో నాకేంటని ఐశ్వర్య కసురుకుని కళ్ళు మూసుకోమని చెప్పి అదే జ్యూస్ లక్కీ నోట్లో పోసి వెళ్లిపోయింది. ఇటు శేషు పార్టీలో చుక్క లేదని ఫీల్ అవుతుంటే రాత్రికి భారీ సెటప్ ఉందని అన్ లిమిటెడ్ అని లక్కీ చెప్పడంతో శేషు ఫుల్ ఖుషీ అయ్యాడు. భ్రమరం రాగానే కవర్ చేసుకున్నాడు.

 

మరోవైపు హాస్పిటల్‌లో సిరి కళ్లు తెరవడంతో డాక్టర్ రాజుకి గుడ్ న్యూస్ చెప్పాడు. బర్త్ డే రోజు రాజు హడావిడిగా వెళ్లిపోవడం చూసి రేఖ అనుమానపడింది. కిచెన్ లో లక్ష్మీ దగ్గర నుంచి ఇందు అసలు విషయం రాబట్టింది. దుగ్గిరాల ఇంటి అమ్మాయిని చేసుకుంటానని నాన్నకి మాట ఇచ్చి వెంకీ నందుని దూరం పెడుతున్నాడని తెలిసి ఇద్దరిని కలపడానికి కేక్ తీసుకురమ్మని ఇద్దరిని కలిపి బయటికి పంపించి ప్లాన్ వేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com