స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1159 లో.. మొత్తం దుగ్గిరాల ఇంట్లో పెళ్లి హడావుడితో సాగింది. ఎన్నో ఏళ్ల తర్వాత తమ ఇంట్లో మళ్లీ పెళ్లి జరుగుతుండటంతో అపర్ణ చాలా ఎమోషనల్ అవుతుంది. పంతులుగారు దగ్గరికి వచ్చి ముహూర్తం పెట్టగా, వెంటనే పెళ్లి చేయాలని లక్కీ ఆత్రుత పడతాడు. దానికి రాజ్ కాస్త నిదానంగా.. మరో వారం, పది రోజుల్లో మంచి ముహూర్తం ఏదైనా ఉందేమో చూడండి పంతులుగారు అని అడుగుతాడు. దీనిపై లక్కీ వెంటనే అభ్యంతరం చెప్తూ.. వద్దు మామా, నేను ఐశుకు దూరంగా అన్ని రోజులు ఉండలేనని అంటాడు. ఇది విన్న నందు వెంటనే లక్కీని ఆటపట్టిస్తూ.. పెళ్లైనా కూడా నిన్ను దగ్గరకు రానిస్తుందన్న నమ్మకం నాకు లేదులే అని పంచ్ వేస్తుంది. దానికి లక్కీ.. అలా అనకు నందు, ఈ పెళ్లి మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నానంటూ ఎమోషనల్ గా చెప్తాడు. పంతులుగారు మాత్రం మూడు నెలల తర్వాతే మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో మీరు తలచుకుంటే కానిదేముందని మరో ముహూర్తం కోసం రిక్వెస్ట్ చేస్తుంది అపర్ణ.
ఇక ఈ పెళ్లిని ఎలా చేయాలనే దానిపై ఇంట్లో పెద్ద చర్చ జరుగుతుంది. అపర్ణ ఈ పెళ్లిని సంప్రదాయబద్ధంగా, ఘనంగా జరిపించాలని అనుకుంటుంది. దీనిపై ఐశు వెటకారంగా.. అంటే ఆకాశమంత పందిరి, భూదేవంతా పీటలు, మండపం నిండా జనాలు, బంధువుల సందడి లాంటి హడావుడి చేయబోతున్నారా అని అడుగుతుంది. అవును, సంప్రదాయం ప్రకారం చేయాలి కదా అని అపర్ణ చెప్తుంది. అప్పుడే శేషు ఎంటర్ అయి.. భ్రమరం పెళ్లి హడావుడి మొదలవ్వబోతుంది.. నువ్వు ఆడపెళ్లి వాళ్ల తరఫు బాధ్యతలు తీసుకో.. నేను మగపెళ్లి వాళ్ల తరఫు బాధ్యతలు తీసుకుంటానని అంటాడు. లక్కీ అయితే పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేద్దామని అంటాడు. ఇందు మాత్రం ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ.. బంధువులు అందరినీ పిలవడానికి వారం రోజుల టైమ్ పడుతుంది, భోజనాల ఏర్పాట్లు ఒక్క రోజులో చేయడం కష్టమని చెప్తుంది. మరోవైపు ఐశు మనసులో మాత్రం.. వీడేంటి ఇంత ఎగ్జైట్ అవుతున్నాడు, త్వరగా పెళ్లయితే బిజినెస్ హ్యాండోవర్ చేసుకోవచ్చని నేను అనుకుంటే వీడికేంటి సంబరమని అనుకుంటుంది. ఆమెకు ఈ పెళ్లి అంటే ఇష్టంతో కాదు, కేవలం కంపెనీ కోసమే చేసుకుంటోందని క్లియర్ గా తెలుస్తోంది.
రేఖ తన కొడుకు లక్కీని పెళ్లి కొడుకులా అందంగా ముస్తాబు చేసి, బంగారు ఉంగరం, బ్రేస్ లెట్ పెడుతుంది. అది చూసి లక్కీ తెగ మురిసిపోతాడు. మరోవైపు ఐశు కూడా పెళ్లి కూతురిలా రెడీ అయి పెళ్లి పీటల మీద కూర్చుంటుంది. పంతులుగారు మంత్రాలు చదువుతూ తాళి కట్టించబోతున్న సమయంలో ఒక్కసారిగా ఐశు లేచి "ఆగండి" అని అరుస్తుంది. దీంతో పెళ్లి మండపంలో ఉన్న దుగ్గిరాల కుటుంబం అంతా షాక్ అవుతుంది. అందరూ నోరెళ్లబెట్టి చూస్తుండగానే ఐశు ఏదో చెప్పబోతుంది. మరి పెళ్లి పీటల మీదే ఐశు పెళ్లిని ఎందుకు ఆపింది? మళ్లీ ఏదైనా కొత్త కండీషన్ పెడుతుందా? లేక రేఖ చెప్పినట్లు ఆస్తి కోసం ఇంకేదైనా ప్లాన్ చేసిందా? అనేది రేపటి ఎపిసోడ్ లో తెలియనుంది.
[brahmamudi serial 1159 episode, telugu tv serial, brahmamudi serial on star maa, brahmamudi saturday episode, brahmamudi serial 10th october episode]





