Home

»

Tv News

Brahmamudi: వెంకీ అరెస్ట్.. ఇంజక్షన్ పడిపోవడంతో ప్లాన్ ఫెయిల్.!

Oct 25, 2026 9:33AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1171 లో.. అపర్ణ, సుభాష్ షష్టిపూర్తి ఏర్పాట్లు రాజ్, ఇందు కలిసి  చూసుకుంటారు. గెస్టులు వస్తారు. దూరం నుంచి రేఖ, భ్రమరాంబ "ఇంకాసేపట్లో ఈ సంతోషం మొత్తం ఆవిరైపోతుంది" అని నవ్వుకుంటారు.

ఇందు అపర్ణ, సుభాష్ లకు దండలు ఇచ్చి మార్చుకోమని చెప్తే.. రేఖ మనసులో ఆ దండలు మీ శవాల మీదకు బాగుంటాయని అనుకుంటుంది. సుభాష్ షష్టిపూర్తి ప్రాముఖ్యత చెబుతుంటాడు. కేక్ కట్ చేయబోతుంటే భ్రమరాంబ అడ్డుకుని.. అపర్ణ గారు ఇవాళ ఇంజక్షన్ ఇచ్చారా  అని అడుగుతుంది. సుభాష్ తీసుకోలేదని చెప్పడంతో రాజ్ అనుమానంగా చూస్తాడు. మా భ్రమరం మంచి చేసిందంటే ఏదో పెద్ద చెడు జరగబోతుందని  శేషు కామెడీ చేస్తాడు. ఇందు ఇంజక్షన్ తీసుకురాగా ఫోన్ రావడంతో ఆగిపోతే, రాజ్ తొందరపడి ఇంజక్షన్ తీసుకోబోయి కింద పడేసి పగలగొడతాడు. ఇది చూసి రేఖ, భ్రమరాంబ ప్లాన్ ఫెయిల్ అయిందని అప్ సెట్ అవుతారు, ఎందుకంటే వాళ్లు మెడిసిన్ మార్చి ఉంచారు. ఇందు మరో ఇంజక్షన్ తీసుకొచ్చి ఇస్తుంది.

మరోవైపు  చలపతి, లక్ష్మీ, వెంకీ భోజనం చేస్తుండగా నందు యూనిఫామ్ లో పోలీసులతో వస్తుంది. వెంకీని గోల్డ్ ఫ్రాడ్ కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చాను, కంపెనీ ఓనరే కేసు పెట్టాడని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. వెంకీ ధైర్యంగా.. ఎలా వెళ్లానో అలాగే తిరిగి వస్తానని చెప్పి స్టేషన్ కు వెళ్తాడు. వెంటనే  రాజ్ కు చలపతి ఫోన్ చేసి విషయం చెప్పడంతో పార్టీలో ఉన్న రాజ్, ఇందు, అపర్ణ, సుభాష్ షాక్ అవుతారు. రేఖ, భ్రమరాంబ, ఐషు మాత్రం వెంకీని తిడతారు. పోలీస్ స్టేషన్ లో నందు.. ఈ కేసు డెప్త్ గా ఎంక్వైరీ చేసి వెంకీని సేఫ్ గా బయటకు తీసుకొస్తానని హామీ ఇవ్వడంతో, రాజ్, ఇందు స్టేషన్ కు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Brahmamudi Episode 1171, Brahmamudi Today Episode, Brahmamudi Oct 24th Episode, Brahmamudi Latest Episode, Brahmamudi Serial, Telugu TV News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com