
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 డే 27 వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ పై ఫుల్ ఫైర్ అయ్యాడు. బిగ్ బాస్ హిస్టరీలో ఎప్పుడూ జరగని విధంగా ఒకేరోజు ముగ్గురికి ఎల్లో కార్డ్స్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. హౌస్ లో కొంతమంది కంటెస్టెంట్స్ హద్దులు దాటుతున్నారని, కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా బూతులు తిడుతున్నారని, బిగ్ బాస్ నే అవమానించేలా జెస్టర్లు చేస్తున్నారని నాగార్జున సీరియస్ అయ్యాడు. ఇలా చేస్తే ఇంట్లో ఉండడానికి అనర్హులని, ఇదే ఆఖరి హెచ్చరిక అని, మరోసారి ఇలా చేస్తే నేరుగా రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఈ మూడు ఎల్లో కార్డ్స్ తో హౌస్ మొత్తం సైలెంట్ అయిపోయింది.
అందులో మొదటి ఎల్లో కార్డ్ రోహిత్ కి పడింది. రోహిత్ చేసిన పనికి నాగార్జున ఏకంగా "గెట్ అవుట్ రోహిత్" అంటూ అరిచాడు. రోహిత్ కెమెరా ముందే నోటితో బూతులు తిడుతూ, పైకి పెదాల కదలికలు మాత్రమే కనిపించేలా తిట్టి, "బిగ్ బాస్ ఏం చేయలేడు, ఏం చేసుకుంటావో చేసుకో" అంటూ మూడు సార్లు చేతితో సైగ చేశాడు. దీని వీడియోను నాగార్జున అందరి ముందు వేశాడు. ఇది చూసిన తర్వాత కూడా శాలిని రోహిత్ ని సపోర్ట్ చేయడంతో శాలినిపై కూడా నాగార్జున ఫైర్ అయ్యాడు. రోహిత్ చేసింది బిగ్ బాస్ ని అవమానించడమే అని, నువ్వు ఇంట్లో ఉండడానికి అనర్హుడివి అని అన్నాడు. చివరకు రోహిత్ భయపడి బిగ్ బాస్ కి క్షమాపణ చెప్పడంతో ఎల్లో కార్డ్ తో వదిలేశాడు.
రెండో ఎల్లో కార్డ్ త్రిగుణ్ కి పడింది. అమన్ తో గొడవలో త్రిగుణ్ వాడిన భాష బాగోలేదని, అలాగే శ్రిస్టిని హర్ట్ చేసేలా మాట్లాడాడని నాగార్జున క్లాస్ తీసుకుని త్రిగుణ్ కి కూడా ఎల్లో కార్డ్ ఇచ్చాడు. మూడో ఎల్లో కార్డ్ అమన్ కి పడింది. అమన్ కూడా టాస్క్ లలో, గొడవల్లో తోటి కంటెస్టెంట్స్ తో దురుసుగా ప్రవర్తించాడని, వాడకూడని మాటలు వాడాడని నాగార్జున చెప్పాడు. దీంతో అమన్ కి కూడా ఎల్లో కార్డ్ ఇచ్చాడు.
ఒకేరోజు ముగ్గురికి ఎల్లో కార్డ్స్ ఇవ్వడం బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే ఫస్ట్ టైమ్. ఎల్లో కార్డ్ అంటే రెడ్ కార్డ్ కి ముందు ఇచ్చే ఆఖరి వార్నింగ్. మళ్ళీ ఇలాంటి తప్పు చేస్తే డైరెక్ట్ గా ఇంటి నుంచి బయటకు పంపిస్తారు. నాగార్జున ఈ ముగ్గురికీ కార్డ్స్ ఇచ్చి మిగిలిన వాళ్లందరికీ కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఇకపై ఎవరైనా నోరు జారితే, రూల్స్ బ్రేక్ చేస్తే పరిస్థితి ఇంతే ఉంటుందని చెప్పడంతో హౌస్ లో అందరూ భయపడిపోయారు.






