
బిగ్ బాస్ సీజన్ 10 ఈ సారి యమక్రేజీగా ఉండబోతుంది. ఎందుకంటే కొంతమంది సెలబ్రిటీలు కన్ఫమ్ అయినట్టు వార్తలొస్తున్నాయి. వారిలో మొదటగా వినపడే పేరు కృష్ణుడు. అతనే వినాయకుడు సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు. ఇతను బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కి వస్తున్నాడని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 2005లో సినీ రంగంలోకి వచ్చిన ఆయనకి హ్యాపీ డేస్ తో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు సినిమాలతో హీరోగా ఆకట్టుకున్నారు. ఈసారి సెలబ్రిటీ కేటగిరీ నుంచి వచ్చే లిస్ట్ లో వినాయకుడు ఫేమ్ హీరో కృష్ణుడు పేరు ఉంది.. అలాగే అధికారిక లిస్ట్ లో కూడా కృష్ణుడు పేరు ప్రముఖంగా ఉంది.
అయితే కృష్ణుడి ఎంట్రీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. పలు సోషల్ మీడియా పేజీలు ఆయన పేరును ఫైనల్ లిస్ట్ లో చేర్చాయి. అయితే ఇది నిజమో కాదో తెలియాలంటే గ్రాంఢ్ ప్రీమియర్ వరకు వేచి చూడాల్సిందే. సెప్టెంబర్ 6, 2026 నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ గా ఈ ల్యాండ్ మార్క్ సీజన్ మొదలు కాబోతుంది.
యాంకర్ వర్షిణి సౌందరరాజన్ కూడా బిగ్ బాస్ సీజన్-10 హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖరారైనట్లు టాక్ నడుస్తోంది. సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లిస్ట్ లో యాంకర్ వర్షిణి పేరు ఉంది.. ఆమె పేరు కన్ఫమ్ అయిన లిస్ట్ లో ఉందని చాలామంది సోషల్ మీడియాలో చెప్తున్నారు. వర్షిణిని బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈటీవీ కోసం మల్లెమాల ప్రొడ్యూస్ చేసిన జబర్దస్త్, పటాస్ 2, ఢీ వంటి షోలకు యాంకరింగ్ చేసి ఆమె ఫేమస్ అయ్యారు. చందమామ కథలు సినిమాతో 2014లో నటిగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత లవర్స్, నన్ను దోచుకుందువటే, జోడీ, మళ్ళీ మొదలైంది, శాకుంతలం వంటి సినిమాలు, పెళ్లి గోల వెబ్ సిరీస్ లో నటించారు. గత సీజన్ల నుంచి ఆమె పేరు వినిపిస్తున్నా ఈసారి మాత్రం పక్కా అని అంటున్నారు.




(2).webp)
