
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నిన్నటి ఎపిసోడ్ లో ఒక అరుదైన రికార్డు నమోదైంది. అదేంటంటే ఇప్పటికి తొమ్మిది సీజన్లు ముగిసాయి. ఏ సీజన్ లోను బ్లాక్ కార్డ్ అనేది ఏ కంటెస్టెంట్ కి ఇవ్వలేదు.. ఎల్లో కార్డ్ ఇచ్చారు తప్ప బ్లాక్ ఇవ్వలేదు. నిన్నటి ఎపిసోడ్ లో రోహిత్ కి బ్లాక్ కార్డ్ ఇవ్వడంతో అందరు షాక్ అయ్యారు. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం.
నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ లో బాగా పర్ఫామ్ చేసిన కంటెస్టెంట్స్ ని అభినందిస్తూనే బాగా పర్ఫామ్ చేయని వారిపై ఫైర్ అయ్యాడు. ముఖేష్, త్రిగుణ్ లకి మాటతీరు మార్చుకోవాలని చెప్పాడు. అయితే రోహిత్ కు గతవారమే ఎల్లో కార్డ్ ఇచ్చాడు నాగార్జున. ఈ వారం కూడా రోహిత్ మాటలు శృతిమించడంతో అతనికి బ్లాక్ కార్డ్ / బ్యాడ్జ్ ఇచ్చాడు నాగార్జున. హౌస్ లో తోటి కంటెస్టెంట్లపై దూకుడుగా ప్రవర్తించడం ముఖ్యంగా ముఖేష్ ని బాడీ షేమింగ్ చేయడం, ఇష్టమొచ్చినట్టు నోరు జారడం, ఫిజికల్ అవ్వడం.. ప్రవర్తన లేదు.. పరివర్తన రాదు.. అంటూ నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యాడు. నామినేషన్స్ లో అతని బిహేవియర్ చూసి ఆడియన్స్ భయపడుతున్నారని..ఇది నువ్వేనా అంటూ నాగార్జున నిలదీసాడు. బాడీ షేమింగ్ మరియు అసభ్య పదజాలం ఉపయోగించడం వల్ల నాగార్జున ఈ తీవ్రమైన చర్య తీసుకున్నారు.
ఈ బ్లాక్ కార్డ్ పెనాల్టీ వల్ల రోహిత్ పై పడిన ప్రధాన ప్రభావాలు ఇవే. కెప్టెన్సీ రేసు నుండి రెండు వారాలు దూరం ఉండాలని నాగార్జున చెప్పాడు. మొదటగా బ్లాక్ కార్డ్ పడినందున రోహిత్ ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్సీ ఉండదని చెప్పాడు. అయితే రోహిత్ మోకాళ్ళ మీద కూర్చొని సారీ సర్..ఇంకెప్పుడు ఇలా చేయను.. దిజ్ ఈజ్ మై ప్రామిస్ సర్ అని రిక్వెస్ట్ చేయడంతో నాగార్జున హౌస్ మేట్స్ ఒపీనియన్ అడిగాడు. అందరు అతనికి సపోర్ట్ గా నిలబడటంతో దానిని రెండు వారాల పాటు కెప్టెన్సీ ఉండదని స్పష్టం చేశాడు. గతవారం రోహిత్ కు నాగార్జున ఎల్లో కార్డ్ ఇచ్చి హెచ్చరించినప్పటికీ, ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఈ బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాల్సి వచ్చింది.
రోహిత్ తన తప్పులను ఒప్పుకుంటూ ఇకపై గేమ్ మారుస్తానని బిగ్ బాస్ కు క్షమాపణలు చెప్పాడు. శాలిని వ్యవహారం, దక్షితో గొడవ, త్రిగుణ్ ని నామినేషన్స్ లో బెదిరించడం, ముఖేష్ ని దూషించడం అన్నీ కలిపి రోహిత్ కి ఈ బ్లాక్ కార్డ్ పడేలా చేశాయి. ఈ ఎపిసోడ్ తర్వాత రోహిత్ గేమ్ ఎలా మారుతుందో చూడాలి మరి.
[Bigg Boss Telugu 10, Rohit Black Card, Bigg Boss Rohit, Bigg Boss 10 Telugu, Akkineni Nagarjuna, Telugu TV News]





