Home

»

Tv News

Bigg Boss Telugu 10 Update: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10  దశావతారం థీమ్.. గ్రాంఢ్ లాంచ్ ఎప్పుడంటే!

Sep 1, 2026 11:33AM

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ అధికారికంగా అనౌన్స్ అయింది. ఈ ల్యాండ్ మార్క్ సీజన్ కు థీమ్.. దశావతారం అని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సీజన్వకి కూడా నాగార్జున హోస్ట్.  8వ సారి వరుసగా హోస్ట్ గా చేస్తున్నాడు నాగార్జున. ఈ సారి ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్ అనే కొత్త ట్యాగ్ లైన్ తో ప్రోమో రిలీజ్ చేశారు. పదింతలు డ్రామా.. పదింతలు ట్విస్ట్ లు ఉంటాయని ఈ ప్రోమోలో చెప్పారు.

 

ఈ సీజన్ సెప్టెంబర్ 6, 2026న స్టార్ మా టీవీలో ప్రీమియర్ కానుంది. సెప్టెంబర్ 7 నుంచి రెగ్యులర్ ఎపిసోడ్స్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతాయి. దాదాపు 15 వారాల పాటు షో నడుస్తుంది. గత సీజన్ మాదిరిగానే ఈ సారి కూడా కామనర్స్ సెలెక్షన్ కోసం అగ్నిపరీక్ష సీజన్-2 ని జూన్ లోనే స్టార్ట్ చేశారు. దాని నుంచి 15 మంది కామనర్స్ ను మెయిన్ హౌస్ కు తీసుకురానున్నారు.

 

కంటెస్టెంట్ల విషయంలో ఇంకా అధికారిక లిస్ట్ రాలేదు కానీ సోషల్ మీడియాలో పెద్ద లిస్టే తిరుగుతోంది. జబర్దస్త్ యాంకర్ వర్షిణి, పల్లవి గౌడ, చంద్రహాస్, జ్యోతి, దీపిక రంగరాజు, తేజస్విని గౌడ, రామ్ ప్రసాద్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. మేకర్స్ మాత్రం సెలబ్రిటీ లైనప్ ను గ్రాండ్ ప్రీమియర్ వరకు సీక్రెట్ గా ఉంచుతున్నారు.

 

ఈ సారి బిగ్ బాస్ హౌస్ సెట్ కూడా పూర్తిగా మార్చేస్తున్నారు. దశావతారం కాన్సెప్ట్ కు తగ్గట్టుగా ప్రతి వారం ఒక అవతార్.. ఒక కొత్త రూల్, ఒక కొత్త ట్విస్ట్ ఉంటుందని టాక్. గేమ్ మొత్తం ట్రాన్స్ ఫర్మేషన్ సర్వైవల్, ఎవల్యూషన్ చుట్టూ తిరుగుతుందని మేకర్స్ చెప్తున్నారు. సీజన్ 10 కాబట్టి చరిత్ర సృష్టించేలా ప్లాన్ చేస్తున్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com