బిగ్ బాస్ తెలుగు సీజన్-10 ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని హౌస్ లో అందరు వణికిపోయారు. ముఖ్యంగా ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుందని చెప్పడంతో టెన్షన్ పీక్స్ కి వెళ్ళింది. శనివారం వరకు 16 మందిలో 11 మంది రిస్క్ లో ఉన్నారని నాగార్జున చెప్పారు. దీంతో ఎవరు వెళ్తారోనని అందరు భయపడ్డారు.
సండే ఎపిసోడ్ లో నాగార్జున ఒక్కొక్కరిని హౌస్ మేట్ గా రివీల్ చేస్తూ వచ్చారు. మొదట ముఖేష్ గౌడని హౌస్ మేట్ అని చెప్పారు. ఆ తర్వాత అమన్ హౌస్ మేట్ అని శ్రిష్టి, షాలినీల చేత చెప్పించారు. తర్వాత శ్రిష్టిని, నరేష్ ని, ఝాన్సీని హౌస్ మేట్స్ గా అనౌన్స్ చేశారు.చివర్లో అసలు ట్విస్ట్ పెట్టారు. వర్షిణి, సుధీర్, కృష్ణుడు అనే ముగ్గురిని గార్డెన్ ఏరియాకు పిలిచారు. మీ ముగ్గురిలో ఒకరు ఇప్పుడు హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుందని బిల్డప్ ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ట్రెజర్ బాక్స్ తీయమని రోహిత్, వంశీలకు చెప్పారు. ఆ బాక్స్ లో ఝాన్సీ పేరు ఉంది. ఇదంతా చేసి లాస్ట్ కి నాగార్జున.. మీ ముగ్గురూ కూడా హౌస్ మేట్స్ అయ్యారు..ఈ వారం నో ఎలిమినేషన్ అని చెప్పారు.
దీంతో వర్షిణి కన్నీళ్లు పెట్టుకుంది, సుధీర్ హ్యాపీగా జంప్ చేశాడు. హౌస్ మొత్తం చప్పట్లు కొట్టింది. అంటే ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయిన చరణ్, చైత్ర మొదటి నుంచి హౌస్ మేట్స్ కాదు కాబట్టి వాళ్లు వెళ్లిపోయారు. ప్రస్తుతం హౌస్ లో 14 మంది ఉన్నారు అందరు సేఫ్ గా సెకెండ్ వీక్ లోకి వెళ్లారు.
[Bigg Boss Telugu 10 no elimination first week, All 16 contestants safe Bigg Boss 10, Nagarjuna surprise garden area task, Varshini Sudhir Krish safe, Bigg Boss 10 Day 7 elimination twist]




