Home

»

Tv News

Bigg Boss 10: డిజాస్టర్ కెప్టెన్ అపూర్వ.. నాగార్జున ఇంతలా ఎప్పుడు ఫైర్ అవ్వలేదు.!

Oct 4, 2026 12:58PM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 డే 27 నిన్నటి శనివారం నాటి వీకెండ్ ఎపిసోడ్ లో కెప్టెన్ అపూర్వపై హోస్ట్ నాగార్జున ఫైర్ అయ్యాడు. ఈ వారం అపూర్వ కెప్టెన్సీని.. డిజాస్టర్ కెప్టెన్సీ అంటూ నాగార్జున మండిపడ్డాడు. కెప్టెన్ అంటే ఇంటిని కంట్రోల్ చేయాలి.. అందరినీ కలిపి తీసుకెళ్లాలి.. గొడవలు జరిగితే సర్ది చెప్పాలి.. డ్యూటీలు, టాస్క్ లు సరిగ్గా చేయించాలి. కానీ అపూర్వ ఈ విషయాల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యిందని నాగార్జున అన్నాడు. ఇంట్లో గొడవలు జరుగుతున్నా కెప్టెన్ గా పట్టించుకోకపోవడం.. ఒక వర్గానికే సపోర్ట్ చేయడం.. డ్యూటీలు సరిగ్గా పంచకపోవడం..‌ తనకు నచ్చిన వాళ్ళకే సపోర్ట్ చేయడం వంటి వాటిపై అపూర్వని నాగార్జున నిలదీశాడు. కెప్టెన్ అంటే అందరికీ కెప్టెన్ కేవలం తన గ్రూప్ కి మాత్రమే కాదని స్ట్రాంగ్ గా చెప్పాడు.

అపూర్వ కెప్టెన్ అయిన దగ్గర నుంచి హౌస్ లో గొడవలు ఇంకా పెరిగాయని నాగార్జున అన్నాడు. ముఖ్యంగా రెడ్ టీమ్ వర్సెస్ బ్లూ టీమ్ టాస్క్ లో రూల్స్ పట్టించుకోకుండా తన ఫేవరెట్ టీమ్ అయిన బ్లూ టీమ్ కి సపోర్ట్ చేయడం అపూర్వ చేసిన పెద్ద తప్పు అని చెప్పాడు. కెప్టెన్ గా న్యాయంగా ఉండాల్సిన అపూర్వ, పక్షపాతం చూపించిందని దీనివల్ల హౌస్ మొత్తం గందరగోళంగా మారిందని అన్నాడు. ఇది ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగులో ఉన్న వరెస్ట్ కెప్టెన్సీలలో ఒకటిగా నిలిచిపోతుందని నాగార్జున కామెంట్ చేయడంతో అపూర్వ షాక్ అయి ఏడుస్తూ కనిపించింది. అపూర్వ కెప్టెన్సీ వల్లే రోహిత్ లాంటి వాళ్ళు రూల్స్ బ్రేక్ చేసేంత ధైర్యం చేశారని కూడా నాగార్జున హింట్ ఇచ్చాడు.

ఈ కామెంట్స్ తో అపూర్వ ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. అపూర్వ మొదటి నుంచి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా, ఫైర్ బ్రాండ్ గా కనిపించింది, కానీ కెప్టెన్ గా మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యిందని నెటిజన్లు కూడా అంటున్నారు. డిజాస్టర్ కెప్టెన్ అనే ట్యాగ్ తో అపూర్వ ఓటింగ్ పై భారీ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. అయితే అపూర్వ తన తప్పును ఒప్పుకుని, ఇకపై ఇలా జరగదని, కెప్టెన్ గా తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తానని నాగార్జునకి మాట ఇచ్చింది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com