Home

»

Tv News

Bigg Boss 10 Telugu :  త్రిగుణ్ మైండ్ గేమ్.. కొత్త కెప్టెన్‌గా రామ్ ప్రసాద్!

Oct 17, 2026 9:24AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో కెప్టెన్సీ టాస్క్ ఊహించని ట్విస్ట్ తో సాగింది. త్రిగుణ్ స్ట్రాటజీతో హౌస్‌మేట్స్‌ షాక్ కి గురయ్యారు. రోడ్ టు రీలోడ్ మరియు కెప్టెన్సీ రేసులో భాగంగా జరిగిన టాస్క్ లో త్రిగుణ్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.

త్రిగుణ్ స్ట్రాటజీని రోహిత్, షాలిని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. వారం నుండి బ్లూ టీమ్, గ్రీన్ టీమ్, గోల్డ్ టీమ్ మధ్య సాగుతున్న కెప్టెన్సీ రేస్ నిన్నటితో ముగిసింది. నిన్నటి ఎపిసోడ్ లో మొదటగా గార్డెన్ ఏరియాలో ఒక బురదని ఏర్పాటు చేసి అందులో బాల్ ని ఉంచాడు బిగ్ బాస్. ఎవరైతే బాల్ ని ఎక్కువ సమయం పట్టుకొని ఉంటారో వారే విజేత ‌.. వారికి ఓడిన టీమ్ లోని కుర్చీలని తీసేసే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. ఇక అందులో ఫైనల్ టాస్క్ లో గ్రీన్ టీమ్ గెలిచింది. శివ్, త్రిగుణ్, అమన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. శివ్ కి త్రిగుణ్ సపోర్ట్ గా చేస్తానని మొదటగా చెప్పడంతో శివ్ అది నమ్మి ఆడాడు. ఇక బ్లూ టీమ్ లో షాలిని, రోహిత్ ఉండటంతో కెప్టెన్సీ రేస్ లో నుండి వాళ్ళని తీసేయాలని అదే టీమ్ లో ఉన్న త్రిగుణ్ గ్రీన్ టీమ్(అమన్) గెలిచేలా చేశాడు. దాంతో ఎక్కువ పాయింట్లు గ్రీన్ టీమ్ వచ్చాయి. అలాగే గోల్డ్ కాయిన్స్ శివ్ దగ్గర ఎక్కువ ఉండటంతో అతను నెక్స్ట్ లెవెల్ కి క్వాలిఫై అయ్యాడు. 

ఆ తర్వాత జరిగిన ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ లో రామ్ ప్రసాద్ చివరి వరకు ఉంది కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గతంలో ఫస్ట్ కెప్టెన్సీ రేసులో ఝాన్సీ చేతిలో ఓడిపోయిన రామ్ ప్రసాద్ ఇప్పుడు కెప్టెన్సీని దక్కించుకున్నాడు. త్రిగుణ్ తన సొంత టీమ్ ని కాదని రామ్ ప్రసాద్ ని గెలిపించేలా స్ట్రాటజీ ప్లే చేయడంతో షాలినీ, రోహిత్ షాక్ అయ్యారు. మొత్తానికి ఈ వీక్ కెప్టెన్ గా రామ్ ప్రసాద్ నిలిచాడు.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com