.webp)
ప్రియాంక ఫైర్ కార్డ్ గెలిచి డేంజర్ జోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హౌస్‌లోకి అమర్ దీప్ ఎంట్రీ ఇచ్చాడు. వస్తూనే తనదైన ఫన్ స్టైల్‌లో రామకృష్ణతో కాసేపు సందడి చేశాడు. ఇద్దరి కామెడీతో హౌస్‌లో కాస్త లైట్ మూడ్ వచ్చింది. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ బయటపెట్టాడు అమర్.
అమర్ తనతో మామూలు ఫైర్ కార్డ్ కాదు, స్పెషల్ వైల్డ్ ఫైర్ కార్డ్ తీసుకొచ్చానని చెప్పాడు. ఇది అన్ని కార్డుల్లోకెల్లా అత్యంత పవర్‌ఫుల్ కార్డ్ అని దీన్ని ఏ టైమ్ లో అయినా ఏ కంటెస్టెంట్‌కైనా వాడొచ్చని క్లారిటీ ఇచ్చాడు. ఈ కార్డ్ ఎంట్రీతో డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లలో టెన్షన్ మరింత పెరిగింది.
ఆ తర్వాత అమర్ మిగిలిన ఇద్దరు డేంజర్ జోన్ కంటెస్టెంట్లు అయిన గాయత్రి, అపూర్వలకు ఒక టాస్క్ పెట్టాడు. వల వేసి స్కోర్ బోర్డ్‌ని పెంచుకునే టాస్క్ అది. ఇద్దరు తమ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అందులో అపూర్వ సరిగ్గా వల వేసి ఎక్కువ స్కోర్ సాధించి గెలిచింది. గాయత్రి ఆ టాస్క్‌లో ఓడిపోయింది.
టాస్క్ గెలవడంతో అపూర్వ డేంజర్ జోన్ నుంచి సేఫ్ అయి బయటకు వచ్చేసింది. గెలిచిన తర్వాత అమర్ తెచ్చిన వైల్డ్ ఫైర్ కార్డ్‌ను తీసుకెళ్లి జ్యూరీకి అప్పగించాడు. దీంతో ఆ పవర్‌ఫుల్ కార్డ్ ఇప్పుడు జ్యూరీ చేతిలోకి వెళ్లింది. ఆ తర్వాత మిగిలిన గాయత్రి, రామకృష్ణల భవిష్యత్తును కంటెస్టెంట్ల ఓటింగ్‌కు వదిలేసింది జ్యూరీ.





.webp)
