
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆదివారం గ్రాంఢ్ గా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అగ్ని పరీక్ష ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. శుక్రవారం ఎపిసోడ్ లో ఫైట్ ఫర్ బీబీ10 అంటూ రాక్ ది ఫ్లోర్ టాస్క్ ను నిర్వహించారు జ్యూరీ. గత అగ్ని పరీక్ష సీజన్ లో కూడా ఇలాంటి ఎలిమినేషన్ ఫార్మాట్ పెట్టగా ఒక్కో ప్లేయర్ ఒక్కో ఆట ఆడుతూ ఒక్కో కంటెస్టెంట్ ను పక్కన పెట్టేశారు. ఇక ఇందులో చివరకు మిగిలిన ఆటగాడికి డైరెక్ట్ బీబీ10 టికెట్ వస్తుంది.
ఈ టాస్క్ స్టార్టింగ్ లోనే లక్కీ డ్రా కీలకంగా మారింది. మొదటి సారిగా ప్రియాంక ఎంచుకున్న నంబర్ లక్కీ డ్రాలో రావడంతో ఆరెంజెస్ కనిపెట్టే టాస్క్ కు ఆమె సెలెక్ట్ అయింది. ఆమెకు పోటీగా షాలిని, మిథిలేష్ వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వచ్చారు. ఇది ఫిజికల్ కంటే మైండ్ గేమ్ తో కూడిన టాస్క్ కావడంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.
ఈ మొదటి టాస్క్ గెలిచిన కంటెస్టెంట్ కు వైల్డ్ ఫైర్ కార్డ్ వస్తుందని బిగ్ బాస్ టీమ్ ప్రకటించింది. ఆ కార్డుతో ఏదైనా ఒక టాస్క్ ను మళ్లీ అదే ప్లేయర్ తో రీసెట్ చేసే పవర్ లభిస్తుందని తెలిపారు. అంటే ఓడిపోయినా మళ్లీ ఆడే ఛాన్స్ ఉంటుంది. దీంతో అందరు ఈ కార్డ్ కోసం పోటీపడ్డారు.
చివరకు ఫస్ట్ లెవెల్ టాస్క్ లో షాలిని విన్ అవుతుంది. దీంతో వైల్డ్ ఫైర్ కార్డ్ ను షాలిని సొంతం చేసుకుని తన ఫస్ట్ స్ట్రాటజీగా ప్రియాంకను పక్కన పెట్టేస్తుంది. మొదటి రౌండ్ లోనే పవర్ కార్డ్ సంపాదించడంతో షాలిని గేమ్ పై పట్టు సాధించినట్టు అయింది.






