Home

»

Tv News

Bigg Boss Agnipariksha Season 2: తొలి ఎలిమినేషన్‌గా గాయత్రి ఔట్..

Sep 1, 2026 10:43AM

అగ్నిపరీక్ష రెండో సీజన్‌లో టాప్ 15 నుంచి తొలి ఎలిమినేషన్‌గా గాయత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. చివరి వరకు డేంజర్ జోన్‌లో రామకృష్ణ, గాయత్రి మిగిలారు. ఆ ఇద్దరిలో ఎవరు ఉండాలి.. ఎవరు వెళ్లాలి అనే నిర్ణయాన్ని జ్యూరీ కంటెస్టెంట్లకే వదిలేసింది. అందరు తమ ఓటు వేయాలని చెప్పింది. ఓటింగ్ సమయంలో కంటెస్టెంట్లు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు. రామకృష్ణ టాస్క్‌ను సరిగ్గా అర్థం చేసుకోకపోయినా, ఆడే ప్రయత్నంలో ఎఫర్ట్ పెట్టాడని ఆటలో కసి కనిపించిందని చాలా మంది చెప్పారు. అదే గాయత్రిలో మాత్రం ఆ ఫైర్, ఎనర్జీ, ఉత్సాహం ఏమీ కనిపించడం లేదని చాలా లోగా ఉందని మెజార్టీ కంటెస్టెంట్లు అభిప్రాయపడ్డారు.

 

దీంతో మెజార్టీ ఓట్లు గాయత్రికి వ్యతిరేకంగా వచ్చాయి. జ్యూరీ నిర్ణయం మేరకు గాయత్రిని ఎలిమినేట్ చేస్తూ ప్రకటించారు. ఎలిమినేషన్ అనౌన్స్ అయ్యాక గాయత్రి ఎమోషనల్ అయింది. నేను ఎవరితోనూ ఫేక్‌గా ఉండలేదు.. నాలా నేనే ఉన్నా. ఒంటరిగా ఉండటం నాకు అలవాటు. ఈ ప్రపంచంలో చివరికి ఒంటరిగానే ఉండాలి. నేను ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు..‌ ఆటల కోసం నటించలేదు. అందరు వీక్ అన్నా కూడా ఏడ్చి సింపతీ గెయిన్ చేసుకోలేదంటూ గాయత్రి కన్నీరు పెట్టుకుంది.

 

గాయత్రి ఎలిమినేషన్‌తో ఇప్పుడు అగ్నిపరీక్షలో 14 మంది కంటెస్టెంట్లు మిగిలారు. ముందు ముందు మరిన్ని ఎవిక్షన్స్ ఉంటాయని జ్యూరీ హింట్ ఇచ్చింది. చివర్లో నవదీప్ ప్రేక్షకులను ఉద్దేశించి.. ఈ 14 మందిలో బిగ్ బాస్ మెయిన్ హౌస్‌లోకి వెళ్లే అర్హత ఎవరికి ఉందో ఆలోచించి మీకు నచ్చిన కంటెస్టెంట్‌కు ఓటు వేయండని కోరారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com