Home

»

Tv News

Bigg Boss Shalini: షాలినిపై నాగార్జున ఫైర్.. బయటకు వెళ్లిపోతానంటూ బోరున ఏడ్చేసిన షాలిని!

Oct 25, 2026 12:33PM

బిగ్ బాస్ తెలుగు 10 ఏడో వారం వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున షాలినిపై తీవ్రంగా ఫైర్ అయ్యాడు. తాను గేమ్ ను చాలా ఇంప్రూవ్ చేసుకున్నానని షాలిని చెప్పడంతో, వీడియో ప్లీజ్ అంటూ ఆమె భాగోతాన్ని బయటపెట్టాడు నాగార్జున. దక్షి మీదికి దూసుకువెళ్తూ పచ్చి బూతులు మాట్లాడిన వీడియో, రామ్ ప్రసాద్ ఆపుతున్నా వినకుండా కొట్టడానికి వెళ్లిన దృశ్యాలు, రూమ్ క్లీన్ చేయమన్నందుకు దేబ్జానీతో అసభ్యంగా మాట్లాడిన వీడియోలను ప్లే చేసి ఇదేనా ఇంప్రూవ్ మెంట్ అంటే, కోపం వస్తే ఫిజికల్ ఎందుకు అవుతున్నావ్ అంటూ నిలదీశాడు.

అంతేకాదు ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి వచ్చినప్పుడు బర్త్ డే గిఫ్ట్ గా మారిన షాలిని కనిపిస్తుందని ప్రామిస్ చేసి మళ్ళీ అదే తప్పు చేస్తున్నావా అని మండిపడ్డాడు. రోహిత్ తో చేస్తున్న సయ్యాటల వీడియోలను చూపిస్తూ, త్రిగుణ్ ముద్దుల గురించి అన్నందుకు నేషనల్ టీవీలో అనడం తప్పు అన్నావ్, మరి అదే నేషనల్ టీవీలో చేయడం తప్పు కాదా అంటూ ప్రశ్నించడంతో షాలిని తల దించేసుకుని ఈ పెయిన్ తీసుకోలేను, బయటకు వెళ్లిపోతానంటూ ఏడ్చేసింది.

ఆ సమయంలో రోహిత్ కల్పించుకోబోతే నాగార్జున అతనిపై కూడా ఫైర్ అయ్యాడు. నువ్వు చేయి ఎత్తింది నీ గురించా, షాలిని గురించా, ఇదేమైనా నామినేషన్ అనుకుంటున్నావా, కూర్చో అంటూ ఇచ్చిపడేశాడు. చివరికి షాలిని మళ్ళీ సారీ చెప్పడంతో ఎన్నిసార్లు సారీ చెప్తావ్, వెళ్లిపోవాలని ఉంటే ఈ క్షణమే వెళ్లిపో అని నాగార్జున అనగా, షాలిని క్షణం కూడా ఆలోచించకుండా వెళ్లిపోతానని అనడంతో డోర్స్ ఓపెన్ చేయండి అంటూ నాగార్జున ఆర్డర్ వేశాడు.

 

 

 

[Bigg Boss 10 Weekend Episode, Bigg Boss 10 October 24 Episode, Bigg Boss Shalini, Bigg Boss 10 Telugu, Akkineni Nagarjuna, Telugu TV News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com