Home

»

Tv News

Bigg Boss 10 : శ్రిష్టి లక్ కొట్టేసిన సుధీర్.. బ్లాక్ కీ పవర్ ఏంటంటే!

Sep 14, 2026 9:28AM

బిగ్ బాస్ సీజన్-10 లో మొదటి వీకెండ్ ఎపిసోడ్ కాస్త ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా సాగింది. ఇక ఇందులో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం..స్టేజ్ మీద నాగార్జు వచ్చీ రాగానే.. మొదట 10 పవర్స్ ఉన్న 10 మందిని నిలబెట్టారు. మీలో ఒకరి పవర్ ఈరోజు మాయం కాబోతోంది అంటూ బ్లాక్ కీ ట్విస్ట్ రివీల్ చేశారు. ఎవరికి బ్లాక్ కీ వస్తుందో హౌస్ మేట్స్ ఓటింగ్ తో డిసైడ్ చేయాలన్నారు.

హౌస్ లో అందరు కలిసి శ్రిష్టి పేరు చెప్పారు. శ్రిష్టి గేమ్ లో యాక్టివ్ గా లేదు.. ఆ పవర్ కి అర్హురాలు కాదంటూ చాలా మంది కామెంట్ చేశారు. దీంతో నాగార్జున శ్రిష్టికి బ్లాక్ మ్యాజికల్ కీ ఇచ్చారు. కీ తీసుకోగానే శ్రిష్టి ముఖంలో షాక్, ఏడుపు కనిపించింది. తన దగ్గర ఉన్న పవర్ బాక్స్ ని వెంటనే బిగ్ బాస్ తీసేసుకున్నారు. అలా శ్రిష్టి పవర్ మాయమైంది.

ఆ తర్వాత నాగ్ పవర్స్ లేని నలుగురు - రోహిత్, అమన్, వర్షిణి, సుధీర్ ని స్టేజ్ పైకి పిలిచారు. మీ నలుగురికి ఒక ఛాన్స్ ఇస్తున్నా, శ్రిష్టి కోల్పోయిన పవర్ బాక్స్ ని గెలుచుకోండి అని అనౌన్స్ చేశారు. ఒక  టాస్క్ పెట్టారు. టాస్క్ లో సుధీర్ ఫాస్ట్ గా చేసి విన్ అయ్యాడు. వెంటనే నాగార్జున సుధీర్ కి ఆ పవర్ బాక్స్ ఇచ్చారు. శ్రిష్టి లక్ నాకు వచ్చింది సర్, థాంక్యూ సర్ అంటూ సుధీర్ ఎమోషనల్ అయ్యాడు. ఈ పవర్ ఏంటో నువ్వు హౌస్ లో ఎవరికి చెప్పకూడదు.. చెప్తే వెంటనే హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతావంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ పవర్ ఏంటో ఇప్పుడు సుధీర్ కి మాత్రమే తెలుసు.

 

 

Bigg Boss 10 Srishti black key power lost episode, Sudhir wins Srishti power box, Bigg Boss Telugu 10 magical keys twist today, Nagarjuna warning to Sudhir, Bigg Boss 10 Sunday Funday power transfer

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com