రోహిత్ ఫౌల్ గేమ్.. అద్దంలో ఫొటోలు చూపించి వర్షిణితో చీటింగ్, అయినా ఝాన్సీకే వార్నింగ్!
.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 నిన్మటి ఎపిసోడ్ లో BB హోటల్ టాస్క్ సాగింది. అందరు హోటల్ కి వచ్చినవాళ్ళని ఇంప్రెస్ చేసి క్యాష్ సంపాదించుకుంటారు. అయితే వర్షిణి-ముఖేష్ ముద్దు పెట్టుకున్న ఫోటోని బిగ్ బాస్ హౌస్ లోకి పోస్ట్ ద్వారా పంపిస్తే దానిని రోహిత్ తోసుకొని.. మూడు వందలు ఇస్తే ఇస్తానని ముఖేష్ తో డీల్ కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత ఫోటో ఇచ్చాడు. ఇక అందరు కాసేపు సరదాగా తమ పర్ఫామెన్స్ తో డబ్బులు సంపాదించారు.
ఆ తర్వాత పజిల్ గేమ్ పెట్టాడు బిగ్ బాస్. దూరంగా రెండు బోర్డులు పెట్టి వాటిపై కొన్ని ఫోటోలు ఉంచాడు.అక్కడ వాటిని చూసిన ఒక కంటెస్టెంట్ అవతలి వైపు ఉన్న మరో కంటెస్టెంట్ కి మాట్లాడకుంటా ఎక్స్ప్రెస్ చేయాలి.. దానిని అవతల ఉన్నవాళ్ళు గ్రహించి బోర్డ్ మీద పెట్టాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఈ గేమ్ కోసం రోహిత్-వర్షిణి, నరేశ్-ఝాన్సీ కలిసి ఆడారు. అయితే ఇందులో రోహిత్ ఆడిన గేమ్ అందరిని షాక్ కి గురి చేసింది.
రోహిత్ ఆడిన ఫౌల్ గేమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ ప్రతీ ఫొటోని అద్దంలో వర్షిణికి చూపిస్తూ, సీక్రెట్ గా అక్కడ పెట్టాడు. ఇది క్లియర్ గా రూల్ బ్రేక్, చీటింగ్ గేమ్. అయితే బిగ్ బాస్ ఇదంతా చూసి కూడా పట్టించుకోలేదు. పైగా చిన్న తప్పు చేసిన ఝాన్సీకి మాత్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో బిగ్ బాస్ రోహిత్ ని గెలిపించాలనే ప్లాన్ తోనే ఉన్నాడని క్లియర్ గా తెలుస్తోందని ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు.
లైవ్ చూసిన ప్రేక్షకులందరికీ వర్షిణి, రోహిత్ ఇద్దరూ కలిసి ఆడిన ఫౌల్ గేమ్ తెలిసిపోయింది. సోషల్ మీడియాలో వారి భాగోతాన్ని బయటపెడుతూ రివ్యూలు ఇస్తున్నారు. ఇది పరమ చెత్త గేమ్, రోహిత్ ఈజ్ వరెస్ట్ గేమర్ అంటూ నెట్టింట కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి వీకెండ్ పై ఉంది. రోహిత్ ఫౌల్ గేమ్ ని హోస్ట్ నాగార్జున బిగ్ టీవీలో చూపించి నిలదీస్తాడా? లేక టాస్క్ గెలిచాడని మెచ్చుకుంటాడా? అనేది చూడాలి. గత వారం బ్లాక్ బ్యాడ్జ్, ఎల్లో కార్డ్ ఇచ్చినా బుద్ధి మారని రోహిత్ పై నాగ్ ఎలా రియాక్ట్ అవుతాడో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.




.webp)
