
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -412 లో... ప్రేమని తీసుకొని ధీరజ్ ఫైనాన్స్ ఆఫీస్ కి వెళ్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావ్ రా అని ప్రేమ అడుగుతుంది. కార్ తీసుకోవాలంటే డౌన్ పేమెంట్ కట్టాలి కదా.. అందుకు లోన్ కోసం వచ్చామని ధీరజ్ చెప్తాడు. లోపలికి వెళ్ళాక నా సర్టిఫికెట్ పెట్టుకొని లోన్ ఇవ్వండి అని ధీరజ్ అనగానే సర్టిఫికెట్స్ కి లోన్ ఇవ్వరు.. ఇక్కడ ఏదైనా ఆస్తుల పేపర్స్ పెట్టి లోన్ తీసుకొవాలని అతను అనగానే.. ప్లీజ్ సర్ అలాంటివి మా దగ్గర ఏం లేవని ధీరజ్ అంటాడు.
అయితే ఎవరినైనా షూరిటి సంతకం పెట్టించుకొని రావాలని అతను అనగానే.. మా మావయ్య రామరాజు గారి సంతకం సరిపోతుందా అని ప్రేమ అంటుంది. నువ్వు రామరాజు కొడుకువా.. అయినా నువ్వు లోన్ అడగడం ఏంటని అతను అంటాడు. నేను సొంతంగా ట్రావెల్స్ బిజినెస్ పెడుదామనుకుంటున్నానని ధీరజ్ అనగానే మీ నాన్న సంతకం పెట్టించుకొని తీసుకొని రా అని అతను అనగానే అవసరం లేదు.. నేనే ఎలాగోలా సెట్ చేసుకుంటానని అక్కడ నుండి వెళ్తాడు. మరొకవైపు ఆనందరావు మిల్ కి వెళ్లి క్యాషియర్ సీట్ లో కూర్చొని భాగ్యంకి ఫోన్ చేసి చెప్తాడు. ఆ తర్వాత రామరాజు ఇంట్లో డల్ గా ఉండడం వేదవతి చూసి.. మీరు ఇంట్లో ఉండడం వద్దు మిల్ కి వెళ్ళండి అని బలవంతంగా పంపిస్తుంది. అది శ్రీవల్లి చూసి ఇప్పుడు మావయ్య వెళ్తే మా ఆయన రైస్ మిల్ బాధ్యతలు మావయ్యకి ఇస్తాడు. అలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడే వెళ్ళాలని క్యారేజ్ తీసుకొని శ్రీవల్లి మిల్ కి బయల్దేరుతుంది.
మరొకవైపు నర్మద ఆఫీస్ లో సాగర్ చేసిన పని గురించి మాట్లాడుకుంటారు. ఎప్పుడు న్యాయంగా ఉండాలని అందరికి చెప్పి.. వాళ్లే డబ్బు ఇచ్చి జాబ్ కొన్నారని నర్మదకి వినపడేలా మాట్లాడుతారు. దాంతో నర్మద ఫ్రెండ్ వచ్చి నర్మద గురించి మీకు తెలియదా.. తన హస్బెండ్ తనకి తెలియకుండా అలా చేసాడని వాళ్ళని తిడుతుంది. నర్మద తలనొప్పిగా ఉందని అక్కడ నుండి వెళ్తుంది. మరొకవైపు లోన్ రాలేదని ధీరజ్ టెన్షన్ పడుతుంటే.. తనని డైవర్ట్ చెయ్యడానికి అక్కడ ఐస్ క్రీమ్ ఉందని బైక్ ఆపమని చెప్తుంది. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







