Home

»

Tv News

Bigg Boss 10 Double Elimination: అయిదో వారం డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్.. అపూర్వ, చరణ్ అవుట్!

Oct 11, 2026 12:56PM

బిగ్ బాస్ సీజన్-10 తెలుగు హోరాహోరీగా సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో అగ్నిపరీక్ష బ్యాచ్ కి మాస్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. అమన్ బూతులు మాట్లాడినందుకు వార్నింగ్ ఇవ్వగా, షాలినీకి, రోహిత్, అపూర్వలకి గట్టిగా క్లాస్ పీకాడు. అపూర్వ ఫ్యామిలీని లాగడంపై సీరియస్ అయ్యాడు, రోహిత్ కి ‘మేలుకో రాజా మేలుకో’ అంటూ గ్రాఫ్ చూపించి తలపొగరు దింపాడు, షాలినీ లవ్ కంటెంట్ పై ఫైర్ అయ్యాడు. ఈ మాస్ వార్నింగ్ తర్వాత హౌస్ మొత్తం సైలెంట్ అయిపోయింది.

ఇక ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న అపూర్వ ఫస్ట్ ఎలిమినేషన్ గా ఎలిమినేట్ అయిందని తెలుస్తోంది. త్రిగుణ్ తో ఫ్యామిలీ గొడవ, సింపతీ ఏడుపు అంటూ నాగార్జున మీదే ఎదురు తిరగడంతో ఆమెకు నెగిటివిటీ బాగా వచ్చింది. నిన్నటి నుంచే లగేజ్ ప్యాక్ చేసిన వీడియో లీక్ కావడంతో అపూర్వ ఔట్ కన్ఫర్మ్ అంటున్నారు.

సెకండ్ ఎలిమినేషన్ గా చరణ్ ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తోంది. అన్ వర్తీ టాస్క్ లో చరణ్ కి 4 స్టాంప్ లు పడ్డాయి, గేమ్ ఆడటం లేదని కంటెస్టెంట్స్ చెప్పారు. రాం ప్రసాద్ సైతం చరణ్ ఆడితే చూడాలని ఉంది సర్ అంటే, నాగార్జున కూడా నాకూ చూడాలని ఉంది కానీ వాడికి చూపించాలని ఉండాలి కదా అని సెటైర్ వేశాడు. దీంతో చరణ్ కూడా డబుల్ ఎలిమినేషన్ లో ఔట్ అయినట్టు టాక్. ఫస్ట్ ఎలిమినేషన్ గా అపూర్వ ఎలిమినేషన్ అయిందని, సెకెండ్ ఎలిమినేషన్ గా చరణ్ ఎలిమినేషన్ అయ్యాడని తెలుస్తోంది. అయితే వైల్డ్ కార్డ్ వచ్చాక ఎవరు ఎలిమినేషన్ అయ్యారనేది తెలియాల్సి ఉంది.

 

 

[Apoorva First Elimination Bigg Boss 10, Charan Second Elimination Bigg Boss Telugu 10, Nagarjuna Mass Warning Agnipariksha Batch, Bigg Boss 10 Telugu Double Elimination]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com