
అగ్నిపరీక్ష సీజన్ 2 హోరాహోరీగా సాగుతోంది. స్టిక్ టాస్క్ తర్వాత శ్రీముఖి ఝాన్సీ దగ్గర ఉన్న హెడ్ స్టార్ట్ ఫైర్ కార్డ్ కి ఈరోజే లాస్ట్ వాలిడిటీ అని చెప్పి.. దాన్ని వాడేయాలని ఆదేశించింది. దీనికోసం ఒక నంబర్ టీం టాస్క్ పెట్టింది. గడ్డిలో దాచిన నంబర్లను వెతికి, ఆ నంబర్ల టోటల్ శ్రీముఖి చెప్పిన నంబర్ కి ఈక్వల్ అయ్యేలా నలుగురు కలిసి ఒక టీంగా ఫామ్ అవ్వాలి. ముందుగా 15 అని చెప్పడంతో ఝాన్సీ, శ్రష్టి, దీపక్, రామకృష్ణ ఒక టీంగా మారారు. అయితే ప్రియాంక తన నంబర్ ని ఫైట్ చేయకుండా దీపక్ కి ఇచ్చేయడంతో జ్యూరీలు ఫైర్ అయ్యారు. ఝాన్సీ దగ్గర ఫైర్ కార్డ్ ఉంది, ఎందుకు ఆమె టీంలోకి వెళ్లలేదు, ఎందుకు వాదించలేదని నవదీప్, బిందు తిట్టారు.
ఆ తర్వాత శ్రీముఖి 21 నంబర్ చెప్పగా రాజకుమారి, అపూర్వ, గాయత్రి, చరణ్ లకు నంబర్ కలిసినా టీంగా మారకపోవడంతో.. ఇలా చేస్తే టీంలు రద్దు చేస్తామని జ్యూరీ వార్నింగ్ ఇస్తుంది. మళ్లీ 21 చెప్పినప్పుడు మిథిలేష్, రాజకుమారి, హేమంత్, చరణ్ ఒక టీం అయ్యారు. చివరగా 19 నంబర్ కి షాలిని, రోహిత్, గాయత్రి, అమన్ టీంగా మారారు. మిగిలిన ప్రియాంక, భాగి, అపూర్వలను బ్లూ టీం అని, వీళ్లకు లీడర్ కూడా ఉండరని జ్యూరీ చెప్పింది. నువ్వు ఎందుకు కన్విన్స్ చేయలేకపోయావ్, నంబర్ ఎందుకు ఎక్స్ఛేంజ్ చేశావని ప్రియాంకను మళ్లీ తిట్టారు. ఆ తర్వాత మూడు టీంలకు లీడర్లను సెలెక్ట్ చేసుకోమన్నారు. గ్రీన్ టీం నుంచి మొదట దీపక్ లీడర్ అని చెప్పి, వెంటనే మార్చి రామకృష్ణ అనడంతో.. మేం చెప్తే మార్చేస్తారా.. మీకంటూ నిర్ణయం లేదా అని జ్యూరీ కౌంటర్ వేసింది. ఎల్లో టీం నుంచి గాయత్రిని లీడర్ అని చెప్పినా షాలిని ఓటింగ్ లో తికమక పెట్టడంతో .. ఏం మాట్లాడుతున్నావ్ షాలిని, బ్యాడ్ పర్ఫామెన్స్ అంతా లీడర్స్ అవుతున్నారని బిందు, నవదీప్ ఫైర్ అయ్యారు. కానీ రాజకుమారి టీం మాత్రం లీడర్ విషయంలో బాగా డిబేట్ చేసింది, దీన్నే బెస్ట్ డిబేట్ అని నవదీప్ మెచ్చుకున్నాడు. ఆ టీం నుంచి చరణ్ లీడర్ అయ్యాడు.
ఫైనల్ గా వచ్చిన స్టాప్ స్టిక్స్ టాస్క్ లో ముగ్గురు మాత్రమే ఆడాలని.. ఒకరిని తీసేయాలని నవదీప్ చెప్పడంతో గాయత్రి అమన్ ని, రామకృష్ణ శ్రష్టిని, చరణ్ హేమంత్ ని తీసేశారు. ఇద్దరు తాడు పట్టుకుంటే ఒకరు విన్నర్ అని బ్లాక్స్ పెట్టాలి. ఈ టాస్క్ లో ఝాన్సీ తన హెడ్ స్టార్ట్ ఫైర్ కార్డ్ వాడేయడంతో రామకృష్ణ టీం విన్ అయింది. విన్నర్ అయినా ఓట్ అప్పీల్ విషయంలో తేడా జరిగింది. ముందు దీపక్ కి ఇస్తామనడంతో.. గెలిచింది ఝాన్సీ వల్ల, ఆమెకి ఇవ్వాలి. లేదంటే డేంజర్ జోన్ లో ఉన్న నువ్వైనా తీసుకోవాలని రామకృష్ణను తిట్టారు. చివరకు రామకృష్ణ ఓట్ అప్పీల్ కి వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






