Home

»

Tv News

Agnipariksha Season2: అగ్నిపరీక్షలో ఫైర్ కార్డ్ ట్విస్ట్.. భాగిని పక్కన పెట్టిన రోహిత్!

Sep 1, 2026 11:26AM

అగ్నిపరీక్షలో ఒక్కో ఎపిసోడ్ ఒక్కోరకంగా మారింది. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేద్దాం.. బాక్సుల టాస్క్ తర్వాత కంటెస్టెంట్లను ఐదు టీమ్‌లుగా విడగొట్టారు. నాలుగు టీమ్‌లలో ముగ్గురు చొప్పున మెంబర్లు ఉండగా.. ఒక టీమ్‌లో మాత్రం హేమంత్, రామకృష్ణ ఇద్దరే ఉన్నారు. ఈ టైంలో రోహిత్‌కి ఫైర్ కార్డ్ పవర్ వచ్చింది. ఒక టీమ్‌లోని మెంబర్‌ని ఇంకో టీమ్‌లోకి యాడ్ చేయొచ్చు.. ఒక మెంబర్‌ని గేమ్ నుంచి పక్కన పెట్టేయొచ్చు అని ఆ పవర్ గురించి అభిజిత్ వివరించాడు. దీంతో రోహిత్ హేమంత్, రామకృష్ణ టీమ్‌లోకి మిథిలేష్‌ను పంపించి.. బాగా ఆడలేదనే కారణంతో భాగిని పక్కన పెట్టేశాడు.

 

రోహిత్ తీసుకున్న నిర్ణయంతో అక్కడ గొడవ మొదలైంది. ఇది పర్సనల్.. పర్సనల్ అంటూ భాగి గట్టిగా అరిచింది. అయితే గేమ్ నుంచి పక్కకు వచ్చిన భాగికి జ్యూరీ ఒక స్పెషల్ పవర్ ఇచ్చింది. రెండు లెవెల్స్‌లో జరిగే టాస్క్‌లో ఫస్ట్ లెవెల్‌లో ఏ రెండు టీమ్‌లు పోటీ పడాలో నువ్వే సెలెక్ట్ చేయాలని శ్రీముఖి చెప్పింది. దీంతో భాగి పర్సనల్‌గా ఫీలైన రోహిత్ టీమ్‌ను ఒక టీమ్‌గా సెలెక్ట్ చేసింది.. రెండో టీమ్‌గా షాలిని టీమ్‌ను ఎంచుకుంది.

 

ఫస్ట్ లెవెల్ టాస్క్‌లో రోహిత్ టీమ్, షాలినీ టీమ్ తలపడ్డాయి. ఈ లెవెల్‌లో రోహిత్ టీమ్ ఓడిపోగా.. షాలిని టీమ్ విన్ అయింది. దీంతో భాగి సంబరం చేసుకుంది. నాకు ఆట రాదని నన్ను పక్కన పెట్టావ్.. ఇప్పుడు నువ్వే ఓడిపోయావ్ కదా అంటూ రోహిత్‌ని చూసి ఎగిరిగంతులు వేసింది. గెలిచిన షాలిని టీమ్ నేరుగా సెకెండ్ లెవెల్‌కి వెళ్లింది.. అక్కడ మిగిలిన మూడు టీమ్‌లతో పోటీ పడాల్సి ఉంటుంది.

 

సెకండ్ లెవెల్‌లో కథ విని బెలూన్లు పగలగొట్టే టాస్క్ పెట్టారు. ఒక కథ చెప్తుంటారు. ఆ కథలో వచ్చిన కలర్స్‌కు తగ్గట్టుగా ఎదురుగా ఉన్న బెలూన్లను పగలగొట్టాలి. ఈ టాస్క్‌లో చాలా మంది పప్పులో కాలేశారు. కానీ రామకృష్ణ, ప్రియాంక మాత్రం బాగా ఆడారు. ఇద్దరికి టై రావడంతో మళ్లీ అవకాశం ఇచ్చారు. అందులో రామకృష్ణ గెలిచాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com