అగ్నిపరీక్ష ఎపిసోడ్-8లో హైలైట్ ప్రియా శెట్టి ఎంట్రీనే. సీజన్ 1 కంటెస్టెంట్ గా వచ్చి స్టేజ్ మీదకు రాగానే మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తున్నాయ్ అంది. వస్తూ వస్తూనే ఫస్ట్ ఫైర్ కార్డ్ ని తీసుకొచ్చింది. అది మామూలు కార్డ్ కాదు.. రివర్స్ ది డెసిషన్ పవర్ ఉన్న కార్డ్. ఇంకా గ్రూపులు కట్టలేదా, రేపు మీ పక్కనోళ్లనే దాటుకుని వెళ్లాల్సి వస్తుందని ముందే వార్నింగ్ ఇచ్చి గేమ్ కి కిక్ ఇచ్చింది.
ఆ కార్డ్ కోసం ప్రియా రాజకుమారిని పిలిచింది. రాజకుమారి చరణ్ ని, చరణ్ అపూర్వని లాగారు. ముగ్గురికి బోర్డు మీద 1 నుంచి 30 దాకా నంబర్లు, ముందు రెండు బెలూన్స్. రూల్ సింపుల్, ఒక నంబర్ చెప్తే దానికి తగ్గట్టు బెలూన్లో గాలి నింపుతారు. ఎవరి నంబర్ కి బెలూన్ పేలుతుందో వాళ్ళు అవుట్. ఫస్ట్ అపూర్వ అవుట్ అయిపోయింది.
లాస్ట్ లో రాజకుమారి, చరణ్ ఇద్దరే మిగిలారు. అక్కడే రాజకుమారి అసలు తెలివి చూపించింది. అందరూ 1, 2 అని చిన్న నంబర్లు చెప్తుంటే, ఒక్కసారిగా 14 అని చెప్పి రిస్క్ చేసింది. దాంతో బెలూన్ ఫుల్ అయిపోయింది, చరణ్ కి ఇంక ఆప్షన్ లేకుండా పోయింది. చిన్న నంబర్ చెప్పినా బెలూన్ పేలి చరణ్ అవుట్. అలా భయపడకుండా ఆడినందుకే ఫస్ట్ ఫైర్ కార్డ్ రాజకుమారి కొట్టేసింది.
Agnipariksha Season 2, Priya Shetty, Rajakumari Dayana, Bigg Boss Telugu updates, TeluguOne entertainment




