బిగ్ బాస్ సీజన్-10 కి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక అగ్నిపరీక్షలో గెలిచిన వారే హౌస్ లోకి ఎంట్రీ అవుతారు. ఫస్ట్ కార్డ్ రాజకుమారి గెలుచుకున్న తర్వాత సెకండ్ ఫైర్ కార్డ్ తీసుకుని వచ్చింది మర్యాద మనీష్. వాడు స్టేజ్ మీదకు రాగానే సీన్ మొత్తం లైట్ అయింది. ఈ లోపు నవదీప్ కి ఏదో పని ఉందని బయటికి వెళ్లిపోయాడు.. దాంతో షోని బిందు, అభిజిత్, శ్రీముఖి ముగ్గురే లాగారు.
సెకండ్ టాస్క్ లో దీపక్, హేమంత్, గాయత్రి పోటీ పడ్డారు. టాస్క్ ఏంటే పేపర్ చేపల్ని ఎగరేసి ప్యాన్ లో పట్టుకోవాలి. దీపక్ మాత్రం ఎవరి జోలికి పోకుండా తన కలర్ చేపల మీదే ఫోకస్ పెట్టాడు. హేమంత్ మాత్రం అటు గాయత్రి ప్యాన్ లోంచి, ఇటు దీపక్ ప్యాన్ లోంచి లాగేయాలని చూశాడు. బజర్ కొట్టాక కూడా గాయత్రి దీపక్ ప్యాన్ లోని చేపల్ని ఎగరగొట్టింది, దానితో చిన్న గొడవ అయింది కూడా.
చివరికి లెక్క చూస్తే హేమంత్ కి 16, గాయత్రికి 24, దీపక్ కి 27 వచ్చాయి. నిజాయితీగా ఆడినందుకు బిందు మాధవి దీపక్ ని బాగా మెచ్చుకుంది కూడా. అలా సెకండ్ ఫైర్ కార్డ్ `స్కిప్ ది రౌండ్ ` దీపక్ కొట్టేశాడు. ఈ కార్డ్ వల్ల ముందు ముందు ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే ఛాన్స్ వచ్చినట్టే. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి.
Agnipariksha Season 2, Bigg Boss Telugu updates, Deepak Fire Card, Maryada Manish, TeluguOne entertainment




